నవ్వుల వేట…క్రైమ్ ట్విస్ట్
బాబా బ్లాక్ షీప్ సినిమా క్రైమ్, కామెడీ, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మేఘాలయ అందాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తొలి దక్షిణాది చిత్రమిది. బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్న స్నేహితులు, అరుదైన బాక్స్ కోసం వేటాడుతున్న గ్యాంగ్‌స్టర్ కథాంశంతో, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌లు, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
బాబా బ్లాక్ షీప్ చిత్రం నవ్వుల వేట, క్రైమ్ ట్విస్ట్‌ల కలయికతో ప్రేక్షకులను అలరించింది. టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, ఓవైపు గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్, మరోవైపు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్న యువకుల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందింది. ఒక మిస్టరీ బాక్స్ వీరి జీవితాలను ఎలా మార్చింది, దాని చుట్టూ జరిగే క్రైమ్, కామెడీ, ఛేజింగ్ ఈ సినిమాకు ప్రధానాకర్షణ.దర్శకుడు గుణీ మంచి కంటి క్రైమ్‌తో పాటే కామెడీని మిళితం చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో విజయం సాధించారు. కథలోని ప్రధాన పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించవచ్చు. అయితే, క్రైమ్ ట్రాక్‌తో పాటు కామెడీని నడిపించిన విధానం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా కథలోని మలుపులు, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి.నటీనటుల విషయానికి వస్తే, అక్షయ్ లగుసాని ఎనర్జిటిక్‌గా కనిపించగా, విష్ణు ఓయ్ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఉపేంద్ర లిమయే గ్యాంగ్‌స్టర్ పాత్రలో డిఫరెంట్ లుక్‌తో మెప్పించారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
