భీమ్లానాయక్‌ పై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. పవన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనా ?? వీడియో

|

Feb 24, 2022 | 9:20 PM

అటు భీమ్లా మేకర్స్‌ను.. ఇటు పవన్‌ ఫ్యాన్స్ను హర్ట్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. పవన్‌ సినిమాను ఎర్లీ మార్నింగ్ చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు గట్టి పంచ్‌ ఇచ్చింది.

YouTube video player

అటు భీమ్లా మేకర్స్‌ను.. ఇటు పవన్‌ ఫ్యాన్స్ను హర్ట్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. పవన్‌ సినిమాను ఎర్లీ మార్నింగ్ చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు గట్టి పంచ్‌ ఇచ్చింది. అలాగే మేకర్స్ భారీ కలెక్షన్‌ ఆశలపై నీళ్లు పోసే ప్రయత్నం చేసింది జగన్ సర్కార్. భీమ్లానాయక్‌ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లకు ప్రభుత్వం తాజాగా ముందస్తు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా బెనిఫిట్‌ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలిచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అదేవిధంగా సినిమా టికెట్‌ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని తెలిపింది.