Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

Edited By:

Updated on: Aug 25, 2026 | 5:38 PM

నటి అనుపమ పరమేశ్వరన్ తన జీవితంలోని కఠినమైన దశ గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా మాట్లాడారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ టాక్సిక్ ప్రవర్తనతో మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పారు. అయితే, ఆమె వ్యాఖ్యలను నటుడు ధృవ్ విక్రమ్‌తో ఉన్న పాత రిలేషన్‌షిప్‌ రూమర్స్‌కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అనుపమ ఎవరినీ పేరుతో ప్రస్తావించకపోయినా, కొందరు అభిమానులు ధృవ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఆన్ స్క్రీన్‌ లోనూ ఆఫ్‌ స్క్రీన్‌లోనూ చాలా హుషారుగా నవ్వుతూ ఉండే అనుపమ పరమేశ్వరన్.. తన జీవితంలోని చీకటి ఫేజ్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. తాను తన భాయ్‌ ఫ్రెండ్ కారణంగా మానసికంగా కుంగిపోయానంటూ తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తన భాయ్ ఫ్రెండ్ సైకో కంటే తక్కువేం కాదంటూ.. తన టాక్సిక్ బిహేవియర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ అనుపమ చెప్పుకొచ్చారు. తాను ఏది చెప్పినా నెలసరి వచ్చిందా అంటూ అవహేళన చేసేవారంటూ ఓ షోలో కన్నీరు పెట్టుకున్నారు అనుపమ. తాను ఏది మాట్లాడిన.. అతని తప్పులను ప్రస్తావించినా.. లేదా ప్రశ్నించినా.. ‘నీకు పీరియడ్స్ వచ్చాయా.? లేదా నీకు ఇంకా డేట్ రాలేదా.?’ మూడ్ స్వింగ్స్‌ కదా అంటూ తక్కువ చేసి మాట్లాడేవాడంటూ అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు తనకు చాలా ఇబ్బందిగా కలిగించేవని… తన మీద తనకే అసహ్యం కలిగేదని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తాను 11 మంది పిల్లలను కనాలి అని కలలు కన్నానని.. కానీ ఇప్పుడు అసలు పిల్లలే వద్దనే స్థాయికి తన భాయ్‌ ఫ్రెండ్ కారణంగా వచ్చానంటూ చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయిగా పుట్టినందుకే తాను ఇన్ని మాటలు పడాలా అని అనిపించేదని.. అంటూ అనుపమ ఎమోషనల్ అయ్యారు. అయితే అనుపమ చేసిన ఈ కామెంట్స్ కాస్తా ఇప్పుడు దృవ్ విక్రమ్‌ను ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. బైసన్ సినిమా టైంలో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే రూమర్ ఉంది. అందుకు తగ్గట్టే ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించారు. లవర్స్‌లాగే బిహేవ్ చేస్తూ కొన్ని సార్లు కెమెరా కంటికి చిక్కారు. ఈక్రమంలోనే అనుపమ దృవ్‌ గురించే చెబుతోందని..అందరూ అనుకుంటున్నారు. దృవ్‌ను నెట్టింట వైరల్ చేస్తూనే.. కొంత మంది అనుపమ ఫ్యాన్స్ ఈ యంగ్ హీరోను ఆడిపోసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు

బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!

Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం

Published on: Aug 20, 2026 03:43 PM
Loading...
Unable to load recommendations.
Follow Us