Anupama Parameshwaran: రాత్రి అయిందంటే.. అది ఉండాల్సిందే…! హాట్‌ హాట్‌ ఫోటోలతో నెట్టింట అనుపమ రచ్చ..(వీడియో)

Updated on: Feb 13, 2022 | 8:57 AM

Anupama Parameshwaran: 'అఆ' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్‏తో దూసుకుపోతోంది. ఈఏడాది అనుపమ రౌడీ బాయ్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ...


Anupama Parameshwaran: ‘అఆ’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్‏తో దూసుకుపోతోంది. ఈఏడాది అనుపమ రౌడీ బాయ్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ సరసన హీరోయిన్‏గా నటించింది. అయితే ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ వలన నెటిజన్స్ కోపాన్ని కూడా చవిచూసింది. అలాగే .సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది. అయితే లిప్ లాక్ సీన్ పై నెటిజన్స్ నుంచి వచ్చిన ట్రోలింగ్ దెబ్బకు అనుపమ సారీ చెప్పిసింది. మరోవైపు రౌడీ బాయ్స్ హిట్‏ను ఈ హీరోయిన్ మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది అనుపమ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‏లో ఉంటుంది. తాజాగా తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. రాత్రి అయితే వైన్ ఉండాల్సిందే అంటూ పోస్ట్ చేసింది. తన ఇన్ స్టా ఖాతాలో తాను వైన్ తాగినట్టుగా ఫోటోకు ఫోజులిస్తూ.. వైన్ కోసమే ఇలా రాత్రి వస్తుంది.. పక్కకి జరపకండి. నా ఫోటోలను చూపించాలని అనుకోవడం లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us