ముహూర్తానికి ముందే మొదలుపెట్టిన సెన్సేషనల్ డైరెక్టర్

Updated on: Jun 14, 2026 | 7:43 PM

సినిమా షూటింగ్ మొదలయ్యేలోపే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు ముహూర్తం కూడా కాకముందే ప్రమోషన్స్ ప్రారంభించిన ఆయన, జీవీ ప్రకాశ్ కుమార్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ వినూత్న వీడియో విడుదల చేశారు. తనదైన హాస్య శైలితో మరోసారి సినిమాపై చర్చ మొదలుపెట్టడంలో సక్సెస్ అయ్యారు.

పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్‌ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ సినిమా మొదలవ్వక ముందే తన మార్క్ ప్రమోషన్ షురూ చేసారు. మరి అవేంటో చూద్దామా..? చూస్తున్నారుగా.. షూటింగ్ కాదు కదా కనీసం ముహూర్తం కూడా పెట్టకముందే తన ప్రమోషన్ మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే ప్రమోట్ చేస్తుంటారు.. కానీ అనిల్‌కు అకేషన్‌తో అసలు పనేలేదు. అనుకుంటే చాలు.. అలా రిలీజ్ చేస్తుంటారు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారుకు తన ప్రమోషనల్ వీడియోలతోనే సగం హైప్ పెంచేసారీయన. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్‌తో చేయబోయే మల్టీస్టారర్ కోసం అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఎవరైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌ను అనౌన్స్ చేయాలంటే.. పోస్టరో, వీడియోనో విడుదల చేస్తారు. అలా చేస్తే అనిల్ రావిపూడి ఎందుకవుతారు చెప్పండి..? అందుకే పాత జంధ్యాల గారి స్టైల్‌లో ఓ సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేసారు ఈ దర్శకుడు. అందులో ఆయనతో పాటు జీవీ ప్రకాశ్ కూడా ఉన్నారు. భీమ్స్‌తో సాగిన మూడేళ్ళ జర్నీకి కామా పెడుతూ.. కొత్త సినిమాకు జీవీని తీసుకున్నారు అనిల్. ఆ అనౌన్స్‌మెంట్ కూడా ఇదిగో ఇలా తనదైన స్టైల్‌లోనే ఇచ్చారు. ఈ దెబ్బతో వెంకీ, అనిల్ సినిమా అప్పుడే ట్రెండ్ అవుతుంది. ముహూర్తానికే ముందే ఇలా ఉంటే.. రేపు షూట్ స్టార్ట్ అయ్యాక ఇంకే రేంజ్ ప్రమోషన్స్ చేస్తారో..? ఏదేమైనా అనిల్ రావిపూడి అంటే ఆ మాత్రం ఉండాలిగా..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల

Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Follow Us