Ram Charan: బన్నీ.. నీ ‘రాకా’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. – చరణ్

Updated on: Jun 12, 2026 | 5:50 PM

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ కూడా బన్నీ ట్వీట్‌కు స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారింది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ వండర్ ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కేవలం 5 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమాపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ‘పెద్ది’ చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “గత రాత్రి ‘పెద్ది’ సినిమా చూశాను. నా ప్రియమైన రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రఫ్ అండ్ రా లుక్, అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, అదిరిపోయే డాన్స్ మూవ్స్‌తో చరణ్ ప్రతి అంశంలోనూ అదరగొట్టాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న ప్రశంసలకు తను 100 శాతం అర్హుడు” అని కొనియాడారు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్, జగపతి బాబు నటనతో పాటు, చరణ్‌ను అత్యున్నత స్థాయిలో చూపించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బన్నీ చేసిన ఈ ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ రివ్యూపై రామ్ చరణ్ వెంటనే స్పందించారు. అల్లు అర్జున్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. “మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం నాకు, మా ‘పెద్ది’ టీమ్‌కు చాలా ప్రత్యేకం. మీరు మాపై చూపించిన ఈ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్. ఇక మీ సినిమా రాకా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు చరణ్. ఒకరి సినిమాలను మరొకరు సపోర్ట్ చేసుకుంటూ, చరణ్-బన్నీల మధ్య ఉన్న ఈ బంధాన్ని చూసి మెగా, అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి సోషల్ మీడియా సంభాషణ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ఇంటికెళ్లి మరీ పవన్‌ను పరామర్శించిన బన్నీ

మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?

కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !

5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది

ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?

Loading...
Unable to load recommendations.
Follow Us