Allu Aravind Rocks: అల్లు అరవింద్ ఎప్పుడో హింట్‌ ఇచ్చారు.. మన బుర్రలకే ఎక్కలే..! అల్లు అరవింద్ రాక్స్ అంతే..!

|

Jun 11, 2023 | 5:47 PM

గుట్టుచప్పుడు కాకుండా దాదాపు 7 ఏళ్లు సాగిన వరుణ్‌ తేజ్, లావణ్య ప్రేమాయణం.. ఎట్టకేలకు ఎంగేజ్‌ మెంట్ వేడుకతో బయట పడిపోయింది. చడీచప్పుడు కాకుండా.. అన్‌అఫీషియల్గా వీరిద్దరు సాగించిన జర్నీ.. ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. బయటికొచ్చి అందర్నీ షాక్‌ చేస్తూనే.. సంబరపడిపోయేలా చేసింది.

గుట్టుచప్పుడు కాకుండా దాదాపు 7 ఏళ్లు సాగిన వరుణ్‌ తేజ్, లావణ్య ప్రేమాయణం.. ఎట్టకేలకు ఎంగేజ్‌ మెంట్ వేడుకతో బయట పడిపోయింది. చడీచప్పుడు కాకుండా.. అన్‌అఫీషియల్గా వీరిద్దరు సాగించిన జర్నీ.. ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. బయటికొచ్చి అందర్నీ షాక్‌ చేస్తూనే.. సంబరపడిపోయేలా చేసింది. అయితే అడపాదడపా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వచ్చే రూమర్స్‌ మధ్యలో..! ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చే లీకుల మధ్యలో.. తమ ప్రేమను బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డ ఈ జంట. అల్లు అరవింద్ కారణంగా మాత్రం దొరికినంత పని చేశారు. ఆయన ఇచ్చిన ఓ దిమ్మతిరిగే హింట్ ను మనం క్యాచ్‌ చేయలేక పోవడంతో.. డెఫనెట్‌ గా నవ్వుకొనే ఉంటారు. కానీ ఇప్పుడదే వీడియో బయటికి రావడంతో.. అది కాస్తా చూసి అందరూ.. అబ్బా మిస్సయ్యాం కదాని అనుకుంటూ ఉంటున్నారు. ఎస్ ! అప్పట్లో జీ2 బ్యానర్లో లావణ్య త్రిపాఠి చావు కబురు చల్లగా అనే సినిమా చేశారు. ఇక ఇదే సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్‌కు వచ్చిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… అప్పుడే ఈ అమ్మాయి తెలుగింటి కోడలవుతందని హింట్ ఇచ్చారు. ‘ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తోంది. ఈ అమ్మాయి ఇక్కడే ఓ కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోతే బాగుంటుంది కదా’ అని లావణ్య మాట్లాడుతుండగా.. మైక్ తీసుకుని మరీ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అల్లు అరవింద్. ఇక తాజాగా వరుణ్‌ లావణ్య ఎంగేజ్ మెంట్ జరగడంతో… ఇప్పుడీ వీడియో బయటికి వచ్చింది. అందర్నీ షాకయ్యేలా చేస్తూ వైరల్ అవుతోంది. అల్లు అరవింద్ ఎప్పుడో చెప్పారు మనమే పట్టించుకోలే.. అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!