2026లో అక్కినేని దండయాత్ర.. నాగ్, చైతూ, అఖిల్ ప్లానింగ్ చూస్తే షాక్ అవుతారు

Edited By:

Updated on: May 26, 2026 | 5:53 PM

అక్కినేని హీరోలు 2026 కోసం భారీ ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నారు. ‘తండేల్’ హిట్ తర్వాత నాగచైతన్య ‘వృషకర్మ’తో పాన్ ఇండియా అటాక్‌కు రెడీ కాగా, నాగార్జున తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు అఖిల్ తొలిసారి ‘లెనిన్’ అనే మాస్ మూవీలో నటిస్తున్నాడు. వరుస అప్డేట్స్‌తో అక్కినేని ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

అయిందేదో అయిపోయింది.. వచ్చే ఏడాదైనా అదరగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని హీరోలు. ఎప్పట్లాగే అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకోగా.. నాగార్జున, నాగచైతన్య మాత్రం తమదైన ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్నారు. చైతు ఆల్రెడీ హిట్స్‌లోనే ఉండగా.. 2026లో గట్టి కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు అఖిల్, నాగ్. పైగా ఒకేరోజు అక్కినేని హీరోలు డబుల్ ట్రీట్ ఇచ్చారు. అక్కినేని హీరోలలో కొత్త జోష్ కనిపిస్తుంది.. ప్రస్తుతం అయితే నాగ చైతన్య ఒక్కడే ఫామ్‌లో ఉన్నారు.. సీన్ చూస్తుంటే అంతా ఒకేసారి దండయాత్రకు రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. తండేల్‌తో హిట్ కొట్టిన చైతూ.. వృషకర్మ అంటూ పాన్ ఇండియన్ అటాక్‌కు సిద్ధమవుతున్నారు. కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా వస్తుంది. దీనికోసం బాగా మేకోవర్ అయ్యారు నాగ చైతన్య. విరూపాక్ష తర్వాత మరోసారి స్ట్రాంగ్ కంటెంట్‌తో వృషకర్మ తెరకెక్కిస్తున్నారు కార్తిక్ దండు. ఇక నాగార్జున విషయానికి వస్తే.. 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 28 ఏళ్ళ తర్వాత టబుతో జోడీ కట్టారు నాగార్జున. పైగా మే 23తో కింగ్ కెరీర్ మొదలై 40 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పారీయన. అఖిల్ సైతం కెరీర్‌లో ఫస్ట్ టైమ్ మాస్ సినిమా చేస్తున్నారు.. అదే లెనిన్. రాయలసీమ పరువు హత్యలపై కథ సాగుతుందని తెలుస్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తాజాగా విడుదలైన కొత్త టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరిగింది. జూన్ 26న విడుదల కానుంది లెనిన్. మొత్తానికి 2026లో అక్కినేని సంభవం లోడ్ అయ్యేలా కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. జూన్‌ 1 నుంచి ‘ధరల బాదుడు’ మొదలా?

30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..

రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..

అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

Follow Us