ఇండస్ట్రీలో అక్కినేని హీరోల టైం మొదలైందా..?

Updated on: Jul 20, 2026 | 4:13 PM

నాగచైతన్య తండేల్తో 100 కోట్ల క్లబ్‌లో చేరగా, అఖిల్ లెనిన్తో విజయం సాధించి అక్కినేని అభిమానులకు ఆనందం కలిగించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న వృషకర్మ, నాగార్జున 100వ సినిమా భారీ అంచనాలతో రానున్నాయి. ఈ విజయ పరంపరతో 2026 అక్కినేని కుటుంబానికి మరిచిపోలేని సంవత్సరంగా మారనుంది.

టాలీవుడ్‌లో అక్కినేని హీరోల విజయ పరంపర మళ్లీ మొదలైందని చెప్పొచ్చు. గత ఏడాది నాగచైతన్య తండేల్ సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం అక్కినేని అభిమానులకు పెద్ద తీపి కబురు. ఈ ఏడాది దానికి ఏమాత్రం తగ్గకుండా అఖిల్ కూడా లెనిన్ సినిమాతో మంచి విజయాన్ని సాధించి తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు వరుసగా ఘన విజయాలు సాధించడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ విజయ పరంపర మధ్య కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే 50 కోట్లకు పైగా జరిగిందని వార్తలు వస్తున్నాయి, ఇది సినిమాకు ఉన్న హైప్‌ను తెలియజేస్తుంది. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.కుమారులిద్దరూ సక్సెస్ ట్రాక్‌లో ఉండగా, కింగ్ నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాతో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us