Aditya Dhar: టాలీవుడ్ వైపు చూస్తున్న ధురంధర్ దర్శకుడు.. రేసులో ఆ హీరో..!

Edited By:

Updated on: Jun 13, 2026 | 3:51 PM

‘ధురంధర్’ విజయంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దర్శకుడు ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్‌తో సినిమా వార్తల తర్వాత ఇప్పుడు ఆయన చూపు ప్రభాస్‌పై పడినట్లు టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయి కథకు సరిపోయే హీరోగా ప్రభాస్‌ను భావిస్తున్న ఆదిత్య ధర్, ఇటీవల ముంబైలో ఆయనతో కథా చర్చలు జరిపినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ధురంధర్ లాంటి బ్లాస్టింగ్ సినిమా తీసిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి బాలీవుడ్ హీరోలంతా క్యూ కడతారు.. జస్ట్ ఆయన ఊ అంటే చాలు నిర్మాతలు లైన్‌లో ఉంటారు. కానీ ఆదిత్య ధర్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. 3000 కోట్ల ఫ్రాంచైజీ తర్వాత ఆయన చూపులు టాలీవుడ్ వైపు పడుతున్నాయి. తాజాగా మన హీరోతోనే టచ్‌లో ఉన్నారీయన. అతనెవరో తెలుసా..? యురి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించిన ఆదిత్య ధర్.. ధురంధర్‌తో ఇండియాస్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైపోయారు. ఈయనతో సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. కానీ ఆదిత్య మాత్రం ఇప్పటి వరకు నెక్ట్స్ సినిమా ఏంటనేది చెప్పలేదు.. సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నా ఆయన చూపులన్నీ తెలుగు హీరోలపైనే ఉన్నాయనే విషయం అర్థమైపోతుంది. మొన్నటి వరకు అల్లు అర్జున్‌తోనే ఆదిత్య ధర్ నెక్ట్స్ సినిమా అనే ప్రచారం జోరుగానే సాగింది. కాకపోతే బన్నీ ఇప్పుడున్న బిజీకి కొత్త సినిమా మొదలవ్వాలంటే కనీసం రెండేళ్లకు పైగానే వేచి చూడాలి. ప్రస్తుతం అట్లీతో.. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్‌తో సినిమాలు ఓకే అయ్యాయి. అందుకే ఆదిత్య ఫోకస్ ప్రభాస్ వైపు షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఆదిత్య ధర్ రాసే కథకు అంతే స్పాన్ ఉన్న కావాలి. ఇండియాలో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే..! అందుకే ముంబైలో సీక్రేట్‌గా ప్రభాస్‌ను ఆదిత్య కలిసారని.. చాలా సేపు డిస్కషన్స్ జరిగాయని తెలుస్తుంది. అన్నీ కుదిరి ఈ కాంబినేషన్ కుదిర్తే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్‌కు పూనకాలు రావడం ఖాయమంటున్నారు అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!

ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..

Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది

Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?

Loading...
Unable to load recommendations.
Follow Us