ముందుకొచ్చిన ఆదిత్య.. సందీప్ ఆలోచిస్తారా ??
"ఆ మాటకు అర్థమేంటి అదిత్యా?" అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' కోసం ఆదిత్య ధర్ సాయం చేస్తానని ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. యానిమల్ డైరెక్టర్ వంగాకు, ధురంధర్ డైరెక్టర్ ధర్ తోడైతే 'స్పిరిట్' అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ కలయిక అసాధారణ ఫలితాలనిస్తుందని అంచనా.
ఆ మాటకు అర్థమేంటి అదిత్యా? అంటూ ఇష్టంగా ఆరా తీస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అసలు ఈ స్టేట్‌మెంట్ ఊహాతీతం అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆదిత్య ఇచ్చిన ఆఫర్‌ని సందీప్ స్వీకరిస్తారా? ఒకవేళ ఓకే అంటే సిట్చువేషన్ ఎలా ఉంటుంది? అనే చర్చలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఎవరన్నారు ధురంధర్ ప్రాపగండా మూవీ అని.. నిజాన్ని ఒప్పుకోలేని వాళ్లు చెప్పే మాటలవి అంటూ కాస్త ఘాటుగానే ధురంధర్ సీక్వెల్ గురించి స్పందించారు సందీప్ రెడ్డి వంగా. మనసులో ఉన్న మాటలని బయటకు చెప్పడానికి మీరు ఏరోజూ తడబడలేదు. నమ్మిన దానికోసం మీరు నిలుచునే విధానం మాకందరికీ స్ఫూర్తి అంటూ సందీప్‌కి రిప్లై ఇచ్చారు ఆదిత్యధర్. యానిమల్ సమయంలోనూ, అంతకు ముందు కబీర్‌సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సందీప్ రెడ్డి మీద విమర్శలు చాలానే వచ్చాయి. అసలు ఇలా ఎలా తీస్తారంటూ సోషల్ మీడియాలో చాలా మంది విరుచుకుపడ్డారు. కొందరికి తగిన రీతిలో సమాధానం ఇస్తూ, మరికొందరి పట్ల సంయమనం వహిస్తూ తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్లారు సందీప్. సందీప్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతూనే స్పిరిట్‌ని కూడా సీన్‌లోకి తీసుకొచ్చేశారు ఆదిత్యధర్. ప్రభాస్ సర్‌కి నా అభిమానాన్ని గురించి చెప్పండి అని అంటూనే, స్పిరిట్ విషయంలో నేను చేయగల సాయం ఉంటే సెలవివ్వండి.. వాలిపోతా అనే సిగ్నల్స్ డైరక్ట్ గా ఇచ్చేశారు. సందీప్ స్పిరిట్‌కి ఆదిత్యధర్ చేసే సాయం ఏ తరహాలో ఉంటుంది? స్క్రిప్ట్ పరంగా రీచెక్ చేస్తారా? స్క్రీన్ ప్లే ని ఫైనల్ చేస్తారా? యాక్షన్ పార్టుల్లో హెల్ప్ చేస్తారా? ఏ రకమైన హెల్ప్ అయినా కావచ్చు… యానిమల్‌లాంటి సినిమా తీసిన డైరక్టర్‌తో ధురంధర్ లాంటి మూవీ చేసిన కెప్టెన్ చేతులు కలిపితే, ఇంటర్నేషనల్ లెవల్లో స్పిరిట్ సినిమాకు వచ్చే బజ్ ఊహాతీతం అని మెస్మరైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. స్పిరిట్‌కి ఆదిత్య సాయం చేసినా, చేయకపోయినా.. చేయనా? అని అడిగిన విధానానికే ఫిదా అవుతున్నారు జనాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: మనసుకు నచ్చిందే చేస్తున్నానంటున్న తమన్నా
Peddi: ‘పెద్ది’ వాయిదా ఖాయమా ??