ఎలా ఉండేది.. ఎలా అయింది! వైరలయ్యేందుకు కాదుగా ఈ డ్రామాలు?

Updated on: Jul 24, 2025 | 7:40 PM

తను శ్రీ దత్తా...! ఒకప్పుడు సినీ రంగంలో వన్‌ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది.!! కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది.. ఈ క్రమంలోనే ఆల్‌ ఆఫ్ సడెన్‌గా... ఈ హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

తన బాధను అందరితో పంచుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సినిమాల్లో స్టార్ ఫేజ్ చూసిన తను శ్రీ దత్తా..ఆ తర్వాత సినిమా ఛాన్సులు రాకపోవడంతో.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. తన ఫోటోలను.. వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి 2018లో.. మీటూ ఆరోపణలు చేసి కాంట్రో క్వీన్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. తనను వెర్సటైల్ యాక్టర్ నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసి… ఇండియా మొత్తాన్ని షాకయ్యేలా చేసింది. దీంతో అప్పట్లో నానా పటేకర్ పై కేసు కూడా నమోదైంది. అయితే.. ఈ కేసులో నానా పటేకర్ కు క్లీన్ చిట్ రావటంతో ఈమెపై నెట్టింట తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ కన్నీరుమున్నీరవుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగా లేదని, రేపో మాపో పోలీసుల దగ్గరకు వెళ్తానని చెప్పుకొచ్చింది. ప్లీజ్.. ఎవరైనా వచ్చి సాయం చేయండంటూ ఏడుస్తూ తనుశ్రీ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాదు కొంతమంది తన ఇంటి డోర్ ను తరుచూ బాదుతున్నారని.. తనను వేదిస్తున్నారని.. తనకు కాపాడాలంటూ వీడియోలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్లు.. తను శ్రీ నాన్ సింక్‌లో మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అటెన్షన్‌ కోసమే ఈమె ఇలా డ్రామాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలా ఉండే హీరోయిన్ చివరికి ఇలా అయింది అంటూ ఆమె సినిమాల్లోని స్టిల్స్‌ను తమ పోస్టుల్లో యాడ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైకుపై కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా వచ్చిన పాము.. ఆ తర్వాత..?

బొంగులో చికెన్‌ కాదు.. వెదురు బొంగుల కూర తింటే వదిలిపెట్టరు

చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఈ కూరగాయలోనే

Sweet Potato: చిలకడ దుంప.. చేసే మేలు ఎంతో

పాములతో ఆటలా? నదిలోకి దూకి పాముల వెలికితీత.. ఎక్కడంటే..