Rashmika Mandanna: ఒక్క డైలాగ్ చెప్పడానికి రష్మిక ఎంత కష్టపడిందో.. వైరల్ అవుతోన్న వీడియో

|

Oct 05, 2024 | 10:15 AM

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మీక మందన్న. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

చాలా మంది హీరోయిన్స్ ఎంతో కష్టపడి స్టార్స్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతో మంది వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మీక మందన్న. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు, సిద్ధార్థ్ మల్హోత్రా, దళపతి విజయ్, రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది రష్మిక.

ఇప్పుడు ఈ అమ్మడుకి చేతినిండా సినిమాలు ఉన్నాయి. రష్మిక ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా చేయగలదు. అలాగే ఎలాంటి డైలాగ్ నైనా చక్కగా పలకగలదు. అయితే రష్మిక అంత ఈజీగా ఇండస్ట్రీలకి అడుగు పెట్టకముందుకు చాలా ఆడిషన్స్ ఇచ్చింది. అప్పట్లో ఒక డైలాగ్ చెప్పడానికి ఎంతో అవస్థ పడేది ఈ చిన్నది. తాజాగా రష్మిక ఆడిషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నడ ఇండస్ట్రీలో ‘కిరిక్ పార్టీ’ అనే  సినిమాతో రష్మిక మందన్న పరిచయం అయ్యింది. ఆ సినిమాకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌ల కోసం ఆడిషన్స్‌కి వెళ్ళింది ఈ బ్యూటీ. రష్మిక మందన్న తొలిసారిగా ఆడిషన్‌కు హాజరైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కన్నడలో డైలాగ్ మాట్లాడేందుకు ఇబ్బంది పడింది. నా పేరు రష్మిక. వయస్సు 19 సంవత్సరాలు. ఎత్తు 5.5. నేను రెండవ సంవత్సరం B.A. చదువుతున్నా. నేను ఆడిషన్‌కి రావడం ఇదే తొలిసారి’ అని రష్మిక మందన్న ఎక్కువగా ఇంగ్లీషులో చెబుతోంది. ‘సాధ్యమైనంత వరకు కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించండి’ అని అక్కడున్న టీమ్ చెప్పగా. ‘ఫస్ట్ టైమ్ ఆడిషన్’ అంటూ రష్మిక నెక్స్ట్ డైలాగ్ చెప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

Follow us on