Priyanka Chopra: షాకింగ్.! ఇండియలో ఉన్న ప్రియాంక ఆస్తులన్నీ హుష్‌ కాకి.. ఎందుకంటే.?

|

Nov 19, 2023 | 12:16 PM

ఒకప్పుడు బాలీవుడ్లో తెగ బిజీగా సినిమాలు చేస్తూ.. క్రేజీ హీరోయిన్ గా నామ్ కమాయించిన ప్రియాంక చోప్రా.. ఉన్నట్టుండి హాలీవుడ్ బాట పట్టింది. అక్కడే స్టార్ అయిన నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ.. హాలీవుడ్ స్టార్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోంది. అక్కడే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. త్రూ అవుట్ వరల్డ్ పాపులారిటీ సంపాదిస్తోంది. కానీ అదేంటో తాజాగా ఇండియాలో ఉన్న తన ఆస్తులను అమ్మకానికి పెడుతోంది ఈ బ్యూటీ.

ఒకప్పుడు బాలీవుడ్లో తెగ బిజీగా సినిమాలు చేస్తూ… క్రేజీ హీరోయిన్ గా నామ్ కమాయించిన ప్రియాంక చోప్రా.. ఉన్నట్టుండి హాలీవుడ్ బాట పట్టింది. అక్కడే స్టార్ అయిన నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ.. హాలీవుడ్ స్టార్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోంది. అక్కడే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. త్రూ అవుట్ వరల్డ్ పాపులారిటీ సంపాదిస్తోంది. కానీ అదేంటో తాజాగా ఇండియాలో ఉన్న తన ఆస్తులను అమ్మకానికి పెడుతోంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో సినిమాలు చేసే సమయంలో ముంబైలో పలు ఆస్తులు కొనుగోలు చేసిన ప్రియాంక.. ఇప్పుడు వీటన్నింటిని అమ్మకానికి పెట్టేస్తోందని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది. గతేడాదే తన పేరిట ఉన్న కొన్ని ఆస్తులను విక్రయించిందీ గ్లోబల్‌ బ్యూటీ… ఇప్పుడు మరో రెండు పెంట్ హౌస్ లు అమ్మేసిందట. దీపావళి వేడుకల కోసం రీసెంట్‌గా ముంబైకి వచ్చిన ప్రియాంక ముంబై, అంధేరిలో ఉన్న తన రెండు పెంట్‌హౌస్‌లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించిందంట. అందుకు ప్రతిఫలంగా 6 కోట్లు తీసుకుందని బాలీవుడ్ న్యూస్. ఓషివారాలోని ఓ పెంట్‌హౌస్‌ను 2.25 కోట్లకు, రెండో పెంట్‌హౌస్‌ను 3.75 కోట్లకు విక్రయించిదట ప్రియాంక. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇండియాతో ఈ బ్యూటీ సంబంధం తెంచుకుంటుందా ఏంటనే అనుమానం అందర్లో కలిగిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.