Nani On Jai Bhim: జైభీమ్ మూవీ వివాదం పై నాని రియాక్షన్.. నేషనల్ అవార్డ్స్ లో కనిపించని జై భీమ్.
తన స్టేట్మెంట్స్‌తో.. తను చేసే ట్వీట్స్‌తో.. అప్పుడప్పుడూ.. వివాదాల్లో ఇరుక్కునే నాని.. ఆ తరువాత సందర్భం వచ్చినప్పుడు.. తన వివాదాస్పద ట్వీట్లపై.. కామెంట్స్ పై క్లారిటీ ఇస్తుంటారు. ఇక తాజాగా కూడా అదే చేశారు. తన ట్వీట్ కారణంగా.. సోషల్ మీడియాలో చెలరేగిన జై భీమ్ కాంట్రో పై.. క్లారిటీ ఇచ్చారు. తన ఉద్దేశ్వం ఏంటో.. తన ట్వీట్‌కు అర్థం ఏంటో.. విత్ ఎగ్జాంపుల్ వివరించారు. ఎట్ ప్రజెంట్ హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న నాని..
తన స్టేట్మెంట్స్‌తో.. తను చేసే ట్వీట్స్‌తో.. అప్పుడప్పుడూ.. వివాదాల్లో ఇరుక్కునే నాని.. ఆ తరువాత సందర్భం వచ్చినప్పుడు.. తన వివాదాస్పద ట్వీట్లపై.. కామెంట్స్ పై క్లారిటీ ఇస్తుంటారు. ఇక తాజాగా కూడా అదే చేశారు. తన ట్వీట్ కారణంగా.. సోషల్ మీడియాలో చెలరేగిన జై భీమ్ కాంట్రో పై … క్లారిటీ ఇచ్చారు. తన ఉద్దేశ్వం ఏంటో.. తన ట్వీట్‌కు అర్థం ఏంటో.. విత్ ఎగ్జాంపుల్ వివరించారు. ఎట్ ప్రజెంట్ హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న నాని.. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా… ఇండియా టుడే తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలోనే.. నాని తన జై భీమ్ ట్వీట్ వివాదం పై మాట్లాడారు. జాతీయ అవార్డ్స్ గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకున్నారని.. అసలు తానెప్పుడు కాంట్రో కామెంట్స్ చేయలేదని చెప్పారు. తెలుగు సినిమాకు జాతీయ అవార్డులు వచ్చినందుకు తాను చాలా గర్వంగా ఫీలయ్యానని చెప్పిన నాని.. అందులోనూ ‘RRR’, ‘పుష్ప’ సినిమాలకు అవార్డ్స్ వచ్చినందకు చాలా సంతోషమేసిందన్నారు. అలాగే తన బ్రదర్ బన్నీకి మొదటి జాతీయ అవార్డును అదుకోవడం కూడా… తన హ్యాపీగా ఫీలయ్యేలా చేసిందన్నారు. దీంతో వీళ్లందరికీ కంగ్రాట్స్ చేస్తూ.. ట్వీట్ చేశానన్నారు. అయితే తనకు పర్సనల్‌గా… నచ్చిన సినిమా ‘జై భీమ్’ అని.. ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ పక్కా అని తాను ఫిక్స్ అయ్యా అన్నారు. అయితే తాను అనుకున్నట్టు అలా జరగకపోవడంతో… జైభీమ్‌తో పాటు హార్డ్ బ్రేక్ ఎమోజీతో ట్వీట్ చేశానన్నారు. ఉదాహరణకు తన చెల్లి ఒక ఘనత సాధించి.. పక్కింటి నా కజిన్ ఏమి సాధించలేకపోతే.. నా చెల్లి కోసం సంతోషం వ్యక్తం చేస్తాను. నా కజిన్ కోసం బాధపడతాను. అలాగే జైభీమ్ సినిమా పట్ల ట్వీట్ చేశాను. అంటూ ఎగ్జాంపుల్ సాయంతో తన ట్వీట్‌ను వివరించారు. తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదిక నుంచి మరో సారి..చెప్పే ప్రయత్నం చేశారు నాని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.