మనం ఎవర్నైనా ప్రేమిస్తే.. పిచ్చిగా అభిమానిస్తే.. ఏం చేస్తాం.. ! అది ఎక్స్‌ప్రెస్ చేసేందుకు రకరకాల దారులు వెతుకుతాం. అందులోనూ అదే పర్సన్స్ బర్త్ డేనో.. లేక స్పెషలో అయితే ఏం చేస్తాం.. ఓ అద్భుతమైన.. అపురూపమైన గిఫ్ట్ ఇవ్వాలని చూస్తాం.. ! అయితే తాజాగా మహేష్ విషయంలోనూ ఇదే చేశారు ఓ క్రేజీ అభిమాని. ఇంతకీ ఏం చేశారంటారా..! తన అభిమానానికి ఆకాశమే హద్దంటూ చాటాడు. ఏకంగా గెలాక్సీలోని నక్షత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు పెట్టేశాడు. దాన్ని రిజిస్టర్ చేయించి ఆ సర్టిఫికేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడా సర్టిఫికేటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ బర్త్ డేకు మహేష్ అందుకున్న అత్యంత అద్భుతమైన గిఫ్ట్ అన్న కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక ఇదంతా పక్కకు పెడితే.. మహేష్ మేనియా సోషల్ మీడియాలో పీక్స్‌లో కెళ్లింది. బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురుస్తోంది. ఇక మెగాస్టార్ చిరు తో సహా.. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరూ మహేష్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేశారు. మరిన్ని సినిమాలు చేస్తూ.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...