రూ.300 కోట్ల సినిమాకు 30 రోజుల ఓటీటీ విండో.. ఇదెక్కడి న్యాయమో మరి..?

Edited By:

Updated on: Jun 13, 2026 | 2:54 PM

వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలు కూడా కేవలం 30 రోజుల్లోపే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ నిర్మాతలు డిజిటల్ డీల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి కొనసాగితే ప్రేక్షకుల థియేటర్ అలవాట్లు మారిపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సోసోగా ఆడిన సినిమాలో.. లేదంటే ఫ్లాప్ సినిమాలో 30 రోజుల్లోపు ఓటిటికి వచ్చేస్తే నష్టం లేదు. ఎందుకంటే ఎర్లీ విండో ఇస్తే కనీసం నిర్మాతలకు నాలుగు డబ్బులైనా వస్తాయి. కానీ వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలని సైతం నెల రోజుల్లోపే ఇచ్చేస్తున్నారు మన నిర్మాతలు. ఇక్కడే అసలు సమస్యలన్నీ వస్తున్నాయి. ఇదేమైనా మారే అవకాశం ఉందా..? సూర్య హీరోగా వచ్చిన కరుప్పు సినిమా 300 కోట్ల క్లబ్బులో చేరింది.. RJ బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం మే 15న విడుదలైంది.. సినిమాకు టాక్ యావరేజ్‌గానే వచ్చినా కలెక్షన్లు మాత్రం మామూలుగా రాలేదు. దాదాపు పుష్కర కాలం తర్వాత సూర్య కోరుకున్న కమర్షియల్ బ్లాక్‌బస్టర్ వచ్చింది. అయితే 300 కోట్లు వసూలు చేసిన సినిమాను 30 రోజుల్లోపే ఓటిటికి ఇచ్చేసారు మేకర్స్. మే 15న విడుదలైన సినిమా.. జూన్ 12న ఓటిటిలోకి వచ్చేస్తుంది.. అంటే 28 రోజుల కంటే తక్కువే టైమ్ పీరియడ్ అన్నమాట. అలాగే ఆ మధ్య సంక్రాంతికి వచ్చి సంచలనం రేపిన మన శంకరవరప్రసాద్ గారు ఓటిటి గ్యాప్ సైతం 30 రోజుల్లోపే.. నారినారి నడుమ మురారి, అనగనగా ఒకరాజు, ఓజి లాంటి సినిమాలు సైతం 4 వారాల్లోపే ఓటిటికి వచ్చేసాయి. హిట్టైన సినిమాలనూ 30 రోజులకే ఇచ్చి.. ఫ్లాపైన మూవీస్‌ను అలాగే చేస్తే ఇంక ఆడియన్స్‌కు థియేటర్స్‌కు వచ్చే మూడ్ ఎక్కడుంటుంది..? టికెట్ రేట్లు కూడా ఇష్టమొచ్చినట్లు పెంచుతుంటారు. ఇవన్నీ చూసాక.. OTT ఇచ్చే ఆఫర్స్ చూసి టెంప్ట్ అవుతున్నారు ఆడియన్స్.. అటువైపే అడుగులేస్తున్నారు. ఈ పద్దతి మారాలంటే నిర్మాత కచ్చితమైన కాల్ తీసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!

ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..

Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది

Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?

Loading...
Unable to load recommendations.
Follow Us