మామిడి టెంకలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు పడేయరు
మామిడి పండ్లు తిన్న తర్వాత పారేసే టెంకలలోని గింజలు జుట్టు, చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. మామిడి గింజల పొడి లేదా బటర్‌ను ఉపయోగించి జుట్టు మృదువుగా, చర్మం తాజాగా ఉంచుకోవచ్చు. అయితే ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మామిడి పండ్ల సీజన్‌లో పండ్లను ఆస్వాదించిన తర్వాత టెంకలను పారేయడం మనకు అలవాటు. కానీ, ఇకపై ఆ టెంకలను పారేయాల్సిన అవసరం లేదు. వాటిలోని గింజలతో జుట్టు, చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మామిడి గింజలలో ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి టెంకలోని గింజలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి తేమను అందించి, జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. అందుకే అనేక సౌందర్య ఉత్పత్తులలో మామిడి గింజల నూనె లేదా బటర్‌ను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడి గింజల పొడిని కొబ్బరి లేదా నువ్వుల నూనెలో కలిపి కాసేపు అలాగే ఉంచి, ఈ నూనెను జుట్టుకు రాసుకుంటే పొడిబారడం తగ్గి, జుట్టు మెరుస్తుంది. మామిడి గింజల పొడిలో పెరుగు, కలబంద గుజ్జు కలిపి జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. మామిడి గింజల బటర్‌లో కొద్దిగా బాదం నూనె కలిపి పెదాలకు రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. మామిడి గింజల పొడిలో తేనె లేదా రోజ్ వాటర్ కలిపి ముఖానికి సున్నితంగా స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. మామిడి గింజల బటర్‌కు షియా బటర్, నూనెలు కలిపి మోచేతులు, మోకాళ్ల వంటి పొడిబారిన చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మామిడి గింజల పొడిలో పెరుగు, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం తాజాగా, హైడ్రేట్‌గా ఉంటుంది. ఈ చిట్కాలను ప్రయత్నించే ముందు గింజలను శుభ్రంగా కడిగి, బాగా ఎండబెట్టడం తప్పనిసరి. అలాగే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వార్త కేవలం మీ అవగాహన కోసమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏ అనారోగ్య సమస్యలున్నా వైద్యనిపుణులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!
Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..
Peddi: నయా కలెక్షన్స్ కింగ్! బాక్సాఫీస్‌కు అసలైన ఛాంపియన్ ‘పెద్ది’
Ram Charan: బన్నీ.. నీ ‘రాకా’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. – చరణ్