ఢిల్లీ కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగికదాడి
ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లోని సల్తనత్ కేఫ్‌లో దారుణం జరిగింది. పార్టీ పేరుతో తోటి ఉద్యోగులు యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కేఫ్ మూసిన తర్వాత తెల్లవారుజాము వరకు మద్యం సేవించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రీత్ విహార్‌లోని సల్తనత్ కేఫ్‌లో పనిచేస్తున్న యువతిపై తోటి ఉద్యోగులే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సమాజంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రాత్రి పార్టీ పేరుతో యువతిని కేఫ్‌కు పిలిచిన నిందితులు, రాత్రి 11:30 గంటలకు కేఫ్ మూసివేసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయారు. నిందితుల్లో ఒకరి దగ్గర కేఫ్ తాళాలు ఉండటంతో, తెల్లవారుజాము వరకు మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు. అనంతరం ఆ యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తక్షణమే స్పందించి, ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తోటి ఉద్యోగులే ఇలాంటి దారుణానికి పాల్పడటం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం :
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి
ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు
తమిళనాట మరో జయలలితగా త్రిష ?https://www.youtube.com/watch?v=B3tbZLBPxXE
