పై నుంచి చూస్తే కూరగాయల లోడే.. లోపల ఏమున్నాయో తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Updated on: May 12, 2026 | 1:20 PM

చూడటానికి అవి కూరగాయల బ్యాగుల్లాగనే కనిపిస్తాయి. చూసిన వారంతా కూరగాయలు అనుకుంటారు. కాని వాటి మాటున ఏముంటుంది తెలుసా? పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. కేటుగాళ్ల ఇస్మార్ట్ ఐడియాకు పోలీసులే నివ్వెరపోయిన పరిస్థితి. పూర్తి వివరాలు కథనం లోపల ...

చూడటానికి అవి సాధారణ కూరగాయల బ్యాగుల్లానే కనిపించాయి. రోడ్డుపై వెళ్తున్న వారికే కాదు.. తొలిచూపులో పోలీసులకు కూడా అనుమానం రాని విధంగా పక్కా ప్లాన్‌తో వాటిని సిద్ధం చేశారు. కానీ తనిఖీల్లో బయటపడిన అసలు నిజం చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కూరగాయల ముసుగులో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్ వైపు ఎండు గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.2 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరికొందరికి అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లకు కూరగాయల తరహా రంగులు, ప్యాకింగ్ ఇస్తూ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ వ్యవహారంలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం ముఠాలు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటుండటంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Follow Us