Video: ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

Updated on: Apr 01, 2026 | 6:27 PM

తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఆఫీసులో పని చేసే ఓ వ్యక్తి ప్రశ్న అడగడానికి వెళ్లినట్లు వెళ్లి, అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెదవులపై ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి చేసిన ఈ చర్య సీసీటీవీలో రికార్డ్ అయింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక సంఘటన జరిగింది.  ఆఫీసులో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టింది. ఆఫీసులో ఒక ఉద్యోగిని సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకుంటుండగా.. తోటి మగ ఉద్యోగి ఏదో ప్రశ్న అడగడానికి వచ్చినట్లు ఆమె దగ్గరకు వెళ్లి పెదవులపై ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ మహిళ అతని చేష్టతో నిశ్చేష్టురాలై.. అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయింది. ఆపై అతనిని వారించడం కూడా వీడియో చూడవచ్చు. అతగాడి వేధింపులు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీంతో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వర్క్ ప్లేసుల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులకు ఓ సాక్ష్యంలా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us