CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఏముందంటే?

Updated on: Apr 14, 2026 | 9:17 PM

నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి కీలక లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలు, పార్టీలు కలిసి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి కీలక లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలు, పార్టీలు కలిసి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లేఖలో సీఎం రేవంత్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు, సీట్ల పెంపుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని.. పెంపు విధానంపై మాత్రమే తమకు అభ్యంతరం ఉందంటున్నారు.

అవేంటనే విషయానికి వస్తే కేంద్రం పాపులేషన్ అండ్ ప్రోరెటా ప్రకారం సీట్లు పెంచాలనుకుంటోందని, అలాగే 50 శాతం పెంపుతో చిన్న రాష్ట్రాలు మరింత చిన్న రాష్ట్రాలుగా, పెద్ద రాష్ట్రాలు మరింత పెద్ద రాష్ట్రాలుగా అవుతాయంటున్నారు సీఎం రేవంత్. జనాభాను తగ్గించినందుకు దక్షిణాదికి రాజకీయ బలం తగ్గాలా అనేది సీఎం ప్రధాన అభ్యంతరం. తాము కేంద్ర ఆదేశాలను పాటించామని అందుకే దక్షణాది బోనస్ అగుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. జస్ట్ దీనిని ఒక ప్రతిపాదనగా మాత్రమే చూడలన్నారు. ఇంకా బెటర్ ఫార్ములా ఉంటే.. దక్షిణాదికి అన్యాయం జరక్కుండా ఉంటే దానికి ఒప్పుకుంటాం అన్నారు. కానీ, ఏం చేసినా సరే, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, పబ్లిక్ హియరింగ్ జరిపి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Apr 14, 2026 09:16 PM
Follow Us