Telangana: ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం ఫోకస్

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సెక్రెటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana: ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం ఫోకస్

|

Updated on: Apr 12, 2024 | 1:45 PM

ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు సెక్రెటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ఫోకస్‌ చేస్తారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తారు. తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow us