వారెవ్వా.. వందేభారత్.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
ముంబైలోని కాంజూర్‌మార్గ్ సమీపంలో వరద నీటితో నిండిన రైల్వే పట్టాలపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు వేగంతో నీరు భారీ కెరటాల్లా ఎగిసిపడగా, పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై వెళ్తున్న వాహనాలపై చిందింది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని రైల్వే అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.
భారీ వర్షాలు కురిసినప్పుడు రైళ్లు నిలిచిపోవడం లేదా నెమ్మదిగా వెళ్లడం మనం చూస్తుంటాం. కానీ, పట్టాలపై వరద నీరు నిండి ఉన్నా.. వాటన్నింటినీ చీల్చుకుంటూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లిన ఓ అద్భుతమైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబైలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కాంజూర్‌మార్గ్ సమీపంలో రైల్వే పట్టాలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏమాత్రం వేగం తగ్గించకుండా నీటిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లింది. రైలు అంత వేగంగా వెళ్లడంతో పట్టాలపై ఉన్న నీరు భారీ కెరటంలా పైకి ఎగిసిపడింది. ఆ నీటి ధారలు ఎంత ఎత్తుకు లేచాయంటే.. పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలపై పడ్డాయి. ఒకవైపు ప్రమాదకరమైన వరద పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు వందే భారత్ దూసుకెళ్లిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు “ఇది పక్కా సినిమా సీన్‌లా ఉంది”, “వర్షంలో వందే భారత్ పరుగు అద్భుతం” అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియో ప్రస్తుత వర్షాల సమయంలోనే చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇది ఎప్పుడు జరిగిందనే విషయంపై రైల్వే అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా ఈ యాక్షన్ సీన్ లాంటి వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
గుడ్‌న్యూస్.. గ్యాస్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!