Gold Price Today: ఏ మాత్రం తరగని బంగారం వెండి, ధరలు.. ఈ రోజు ఎంతంటే

Updated on: Feb 10, 2026 | 7:34 PM

ఈ రోజు, ఫిబ్రవరి 10 మంగళవారం, బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి ఫిబ్రవరి 9 సోమవారం ధరల వద్దే ఇవి నిలిచి ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,910, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,750 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,00,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని లేటెస్ట్ రేట్లు ఇక్కడ ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు ధరలను ధృవీకరించుకోవాలని సూచించబడింది.

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతూ పోతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 9 సోమవారం నాటి ధరలే కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి బంగారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 10 మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,910 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,750గా ఉంది. కిలో వెండి ధర రూ.3,00,000లు పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,060 ఉంటే, 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,900 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,910, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,750లు పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060 వద్ద ట్రేడవుతుండగా… 22 క్యారెట్ల బంగారం రూ.1,45,800 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,910లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,750 పలుకుతోంది. వెండి కిలో రూ. 3,00,000గా ఉంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు..

నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో

వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు

ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు