Post Office Scheme: ఈ పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం.! పోస్టాఫీస్‌ మంత్లీ స్కీమ్.

|

Mar 15, 2024 | 8:51 PM

పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకువారు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్‌ సేఫ్‌ అన్నమాట. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది.

పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకువారు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్‌ సేఫ్‌ అన్నమాట. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఖాతాను ఎవరైనా సరే వ్యక్తిగతంగా, జాయింటుగా (గరిష్ఠగా ముగ్గురు వ్యక్తులు) తెరవొచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్‌ (మైనర్‌ ఖాతా) ఖాతా తెరవొచ్చు. ఈ పథకంలో క‌నీసం 1,000 రూపాయలు పెట్టుబ‌డిగా పెట్టొచ్చు. సింగిల్‌ ఖాతాలో గ‌రిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంఐఎస్‌ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు ఉపసంహరణకు నిబంధల ప్రకారం వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ఉదాహరణకు.. మీకు నెలవారీ 5,550 రూపాయల ఆదాయం రావాలనుకుంటే 9 లక్షలు ఎంఐఎస్ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయాలి. ఇక జాయింట్‌ ఖాతా తెరిచి 15 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేసిన వారికి 9,250 రూపాయల నెలవారీ డబ్బు వస్తుంది. సీనియర్‌ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకొంటే ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on