Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు

Updated on: Apr 27, 2026 | 7:40 PM

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసినప్పటికీ, మీ పేటీఎం యాప్, యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు నిరంతరాయంగా పని చేస్తాయి. పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు, కానీ కొత్తగా డబ్బు జమ చేయడం లేదా వాలెట్ టాప్-అప్ చేయడం కుదరదు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; డిజిటల్ చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయి.

డిజిటల్ పేమెంట్స్‌లో విప్లవం సృష్టించిన పేటీఎం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్’ లైసెన్స్‌ను రద్దు చేయడంతో కోట్లాది మంది యూజర్లు తమ డబ్బు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ లైసెన్స్ రద్దు అంటే ఏమిటి? మన ఫోన్ పేమెంట్స్ ఆగిపోతాయా? అసలేం జరగుతోంది.. తెలుసుకుందాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు కొత్తేమీ కాదు. 2022 నుంచే ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఆర్బీఐ నిఘా పెంచింది. నిబంధనల ఉల్లంఘన, కస్టమర్ల వివరాల సేకరణలో లోపాలు, డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉండటం వంటి కారణాలతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. చివరికి, ఈ బ్యాంక్‌ను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని భావించి లైసెన్స్‌ను అధికారికంగా రద్దు చేసింది. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీ పేటీఎం యాప్, యూపీఐ సేవలు, క్యూఆర్ కోడ్ లావాదేవీలు ఎప్పటిలాగే నిరంతరాయంగా పనిచేస్తాయి. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు తమ వ్యాపారంపై ఎలాంటి ఆర్థిక ప్రభావం చూపదని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం తన ప్రధాన చెల్లింపుల సేవలను బ్యాంకింగ్ విభాగం నుంచి వేరు చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతితో భాగస్వామ్య బ్యాంకుల ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను కొనసాగించడానికి అనుమతి పొందింది. కాబట్టి, మీరు రోజువారీగా చేసే పేమెంట్లు, బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కస్టమర్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కొత్తగా డబ్బును డిపాజిట్ చేయడం లేదా పేటీఎం వాలెట్‌ను టాప్-అప్ చేయడంపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. ఈ సేవలు పనిచేయవు. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం వల్ల ఆ బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయాయి కానీ, పేటీఎం యాప్ ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కాబట్టి, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిజిటల్ పేమెంట్స్ ఎప్పటిలాగే సురక్షితంగా సాగిపోతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??

Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్‌

పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు

Follow Us