LIC: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే కొత్త పాలసీలు..

Updated on: Oct 19, 2026 | 4:43 PM

ఎల్‌ఐసీ మూడు కొత్త బీమా పథకాలను అక్టోబర్‌ 19, 2026 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. న్యూ జీవన్‌ ధార-II పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునేవారికి, హెల్త్‌ షీల్డ్‌ ఆరోగ్య అవసరాలకు, న్యూ క్యాన్సర్‌ కవర్‌ నిర్దిష్ట క్యాన్సర్లకు ఆర్థిక రక్షణ కల్పించేలా రూపొందించినట్లు సమాచారం. క్యాన్సర్‌ పాలసీ బీమా మొత్తానికి సంబంధించిన పరిమితులు, ప్రయోజనాలు, మినహాయింపులను పరిశీలించిన తర్వాతే పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశీయ దిగ్గజ బీమా రంగ సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ వినియోగదారుల కోసం మరో మూడు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పాలసీలు అక్టోబర్ 19, 2026 నుంచి దేశీయ మార్కెట్లో అధికారికంగా అందుబాటులోకి రానున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది. ఇందులో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్, ఆరోగ్య బీమా ప్లాన్, క్యాన్సర్ కవర్ పాలసీలు ఉన్నాయి. ‘న్యూ జీవన్ ధార – II’, ‘హెల్త్ షీల్డ్’, ‘న్యూ క్యాన్సర్ కవర్’ పేరుతో రానున్న ఈ కొత్త ప్లాన్‌లన్నీ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ కేటగిరీ కిందకు వస్తాయి. ఈ మూడు ప్లాన్‌లలో ‘న్యూ జీవన్ ధార – II’ అనేది వ్యక్తిగత పొదుపు మరియు డిఫర్డ్ యాన్యుటీ పథకం. పదవీ విరమణ తర్వాత ఎలాంటి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కచ్చితమైన హామీతో కూడిన ఆదాయం కోరుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రెండోది ‘హెల్త్ షీల్డ్’ పాలసీ. ఇది కుటుంబ ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీనిలో పాలసీ కాల వ్యవధి, ప్రీమియాలు స్థిరంగా ఉండటమే కాకుండా, ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ నగదు ప్రయోజనం కూడా లభిస్తుంది. మూడవది ‘న్యూ క్యాన్సర్ కవర్’ పాలసీ.. నిర్ణీత క్యాన్సర్లు నిర్ధారణ అయినప్పుడు, వాస్తవ చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా నేరుగా పాలసీ విలువను చెల్లిస్తుంది. ఈ పథకం కింద రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చని, ఇప్పటికే ఉన్న ఇతర క్యాన్సర్ పాలసీలతో కలిపి గరిష్ఠ బీమా మొత్తం రూ.50 లక్షల వరకు ఉంటుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. అయితే ఏజెంట్లు తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున, పాలసీలు తీసుకునే ముందు వినియోగదారులు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!

రుణ గ్రహీతలకు షాక్‌.. వడ్డీ రేట్లు పెంచేసిన SBI

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై వారికీ రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపు!

బిగ్ అలర్ట్.. ఇకపై విమాన ప్రయాణంలో అది తీసుకెళ్లటం కుదరదు

Loading...
Unable to load recommendations.
Follow Us