గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

Updated on: Jun 28, 2026 | 5:58 PM

పోస్టాఫీస్ ఖాతాదారులకు భారత తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఆధార్ ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ధృవీకరణతో రూ.50 వేల వరకు డిపాజిట్, రూ.20 వేల వరకు విత్‌డ్రా చేసేందుకు పేపర్ స్లిప్ అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రస్తుతం సింగిల్ అకౌంట్లకు మాత్రమే వర్తించనుండగా, మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి.

పోస్టాఫీసు ఖాతాదారులకు భారత తపాలా శాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై చిన్న మొత్తాల లావాదేవీల కోసం ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఈ-కేవైసీ , బయోమెట్రిక్ విధానం ద్వారా సులభంగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూన్ 22 నుంచే ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డీ , సేవింగ్స్ ఖాతాదారులు ఎలాంటి ‘పే-ఇన్ స్లిప్’ లేకుండా కేవలం బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా రూ.50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, ఎలాంటి ‘విత్‌డ్రాయల్ స్లిప్’ లేకుండా రూ.20,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పరిమితి దాటితే మాత్రం తప్పనిసరిగా పాత పద్ధతిలోనే పేపర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సరికొత్త సదుపాయం కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మైనర్ లేదా జాయింట్ అకౌంట్లకు ఇది వర్తించదు. ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారు త్వరలోనే దేశంలోని ఏ పోస్టాఫీస్ బ్రాంచ్ నుంచైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆధార్ లింక్ లేని వారు మాత్రం హోమ్ బ్రాంచ్‌కే వెళ్లాలి. బయోమెట్రిక్ లావాదేవీలకు మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి. 2026 సెప్టెంబర్ 1 నుంచి DREAM యాప్ ద్వారా జరిగే లావాదేవీలకు మొబైల్ నంబర్ అనుసంధానం లేకపోతే అనుమతించరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!

టిఫిన్‌ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!

మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!

WhatsApp: వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

Follow Us