Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్
బంగారం ప్రియులకు అలర్ట్! ఫిబ్రవరి 19న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. జనవరిలో పెరిగిన ధరలు ఫిబ్రవరిలో తగ్గినప్పటికీ, ఇప్పుడు తిరిగి పైకి ఎగబాకుతున్నాయి. డాలర్ విలువ పుంజుకోవడం, పెట్టుబడిదారులు లాభాలు బుకింగ్ చేసుకోవడంతో మార్కెట్లో ఒత్తిడి ఏర్పడి ధరలు మారాయి. దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా ధరలను ఇక్కడ తెలుసుకోండి.
బంగారం ప్రియులకు అలర్ట్.. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఫిబ్రవరి 19 గురువారం మళ్ళీ పెరిగాయి. జనవరి నెలలో అమాంతం పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఒక్కసారిగా పడిపోయింది. పెట్టుబడిదారులు లాభాలు బుకింగ్ చేసుకోవడంతో బంగారం ధర మార్పులకు లోనైంది. డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లించారు. దీంతో బంగారం మార్కెట్లో ఒత్తిడి ఏర్పడింది. పసిడి ధరలు నేల చూపులు చూశాయి. అయితే తాజాగా ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో గురువారం 24 క్యారెట్ల బంగారంపై రూ.2,290లు పెరిగి 10 గ్రాముల బంగారం రూ.1,56,490లకు చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,100 పెరిగి రూ.1,43,450లు పలుకుతోంది. వెండిధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ.10,000లు పెరిగి రూ.2,70,000 లకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,640 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,600 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,490 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,180 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,45,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,490 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 లు పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,70,000లుగా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: నాగ చైతన్యతో.. గంగూలీ, జాన్ అబ్రహాం ఢీ అంటే ఢీ.. ఇంతకీ గెలిచేది ఎవరో
Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
