Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు

Updated on: Mar 02, 2026 | 11:00 AM

మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. యుద్ధ భయాలు, సప్లై చైన్ సమస్యలు, పెట్టుబడిదారులు పసిడిని సురక్షిత ఆస్తిగా చూడటంతో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,73,080, కేజీ వెండి రూ.3,25,000 మార్కును తాకాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు, ఇది సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం బంగారంపై పడింది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరుకోగా, కేజీ వెండి ధర ఏకంగా రూ.3,25,000 మార్కును తాకింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడం ఖమేనీ మరణంతో ఇరాన్‌ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్‌ అట్టుడుకుతోంది. ఈ తీవ్ర యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ బులియన్ మార్కెట్‌పై భారీగా పడింది. యుద్ధం కారణంగా సప్లై చైన్‌ దెబ్బతినడం, సురక్షితమైన పెట్టుబడిగా పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో, మార్చి 1 నాటికి బంగారం, వెండి ధరలు చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరింది. అలాగే.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.4,000 ఎగబాకి రూ.1,58,650 వద్ద పలుకుతోంది. తాజా పరిణామాలతో బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధరపై ఒక్కరోజే రూ.5,000 పెరగడంతో.. అది రూ.3,25,000 మార్కును తాకింది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అనూహ్య పెరుగుదల సామాన్య ప్రజలను, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..

Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు

US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

Follow Us