EPFO: వాడని పీఎఫ్ ఖాతాల్లోని డబ్బులు వాపస్
కేంద్రం ఈపీఎఫ్‌వో క్రియారహిత ఖాతాల కోసం ఒక పైలట్ ప్రాజెక్టును ఆమోదించింది. రూ.1000 లోపు ఉన్న బ్యాలెన్స్‌లు ఖాతాదారుల బ్యాంకు ఖాతాలకు ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. దీనికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేదు. ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు వెంటనే డబ్బు జమ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, మిగిలిన 25 లక్షల ఖాతాలకు కూడా అమలు చేస్తారు.
యాక్టివ్‌గా లేని EPFO ఖాతాల్లో ఉన్న చిన్న మొత్తాలను వాపసు చేసే పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తును పెట్టుకోవలసిన అవసరం లేదు. వరుసగా మూడేళ్ల పాటు ఎటువంటి చెల్లింపులు స్వీకరణలు లేని ఖాతాను నిర్వహణలో లేని ఖాతాగా ఈపీఎఫ్‌వో పరిగణిస్తుంది. రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న నిర్వహణలో లేని ఖాతాల నుంచి పీఎఫ్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ జరుగుతుంది. ఈ ప్రక్రియను చేపట్టేందుకు లబ్ధిదారులు ఎటువంటి క్లెయిమ్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదు. 7 లక్షలకు పైగా నిర్వహణలో లేని ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. . ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు డబ్బు వెంటనే జమ అవుతుందని, అర్హులైన మిగిలిన ఖాతాలకు దశల వారీగా డబ్బు జమ అవుతుందని EPFO వర్గాలు తెలిపాయి. దేశంలో మొత్తం నిర్వహణలో లేని ఈపీఎఫ్‌వో ఖాతాలు 31.86 లక్షలు ఉండగా వీరికి సంబంధించిన మొత్తం డబ్బు రూ.10,903 కోట్లు ఉంది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ ప్రయత్నం విజయవంతమైతే మిగిలిన 25 లక్షల నిర్వహణలోని లేని ఖాతాలకు కూడా ఈ ఆటోమేటిక్ రిఫండ్ విధానం అమలు చేస్తారు.. ఈ నిర్వహణలో లేని ఖాతాలు 20 ఏళ్లకు పైగా అమల్లో ఉండి గడచిన మూడేళ్ళుగా క్రియాశీలకంగా లేనట్లు పరిగణించాలి. వివిధ కారణాల వల్ల పీఎఫ్ ఖాతాలు నిర్వహణలో లేకపోవడం జరుగుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
Ram Charan: మాలతో చరణ్ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్ క్లారిటీ
Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..
Vijay-Rashmika Marriage: కట్టా- మీటా లాంటి లవ్ స్టోరీ.. ఎన్ని స్టేజ్‌లు దాటారంటే ??
