థెరపీ చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తారా?హెల్త్ పాలసీ తీసుకోబోయేముందు ఈ నిజాలు తెలుసుకోండి!

Updated on: Oct 17, 2026 | 5:20 PM

మానసిక ఆరోగ్య సమస్యలకు థెరపీ తీసుకోవాలనుకునేవారికి ఆరోగ్య బీమా ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి పాలసీలో సైకాలజిస్ట్‌ కన్సల్టేషన్‌, కౌన్సెలింగ్‌, సైకోథెరపీ సెషన్లకు కవరేజీ ఉండదు. కొన్ని పాలసీలు ఆసుపత్రిలో చేరినప్పుడు చేసే చికిత్సకే పరిమితం కావచ్చు. మరికొన్నింటిలో ఓపీడీ ప్రయోజనాలు, సెషన్ల సంఖ్య, ఖర్చులపై పరిమితులు ఉంటాయి. అందుకే థెరపీ ప్రారంభించే ముందు పాలసీ నిబంధనలు, మినహాయింపులు, క్లెయిమ్‌ విధానాన్ని పరిశీలించడం ముఖ్యం.

మానసిక ఒత్తిడితో సతమతమయ్యే ఎంతోమంది దాని నుంచి బయటపడేందుకు నిపుణుల సహాయం తీసుకోవాలని భావిస్తారు. కానీ థెరపీ సెషన్లకు అయ్యే ఖర్చులు బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఆరోగ్య బీమా పాలసీ ఉందని, సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్‌ను సంప్రదిస్తే ఆ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందని చాలామంది పొరపడుతుంటారు. వాస్తవానికి చాలా పాలసీల్లో మానసిక ఆరోగ్య చికిత్సకు కవరేజీ ఉన్నప్పటికీ, సాధారణ కౌన్సెలింగ్, తరచుగా తీసుకునే థెరపీ సెషన్లకు బీమా వర్తించకపోవచ్చు. అందుకే చికిత్స ప్రారంభించే ముందు పాలసీ నిబంధనలను పూర్తిగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ముందుగా పాలసీ షెడ్యూల్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్, పూర్తి నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. అందులో ఓపీడీ, సైకోథెరపీ, సైకాలజిస్ట్, కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య చికిత్స వంటి పదాల కోసం వెతకాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీలో మానసిక ఆరోగ్య కవరేజీ ఉందనే సాధారణ ప్రకటనను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదు. కొన్ని పాలసీలు మానసిక అనారోగ్యానికి సంబంధించిన ఆసుపత్రి చికిత్స ఖర్చులను మాత్రమే భరిస్తాయి. ఆసుపత్రిలో చేరకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించడం, కౌన్సెలింగ్ తీసుకోవడం లేదా క్రమం తప్పకుండా సైకోథెరపీ చేయించుకోవడం వంటి ఖర్చులకు కవరేజీ ఉండకపోవచ్చు. మరికొన్ని పాలసీల్లో ప్రత్యేక ఓపీడీ ప్రయోజనం, అదనపు కవరేజీ లేదా ఉద్యోగ సంస్థ అందించే ఆరోగ్య బీమా ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉండవచ్చు. కొన్ని బీమా పథకాలు అర్హత కలిగిన నిపుణుల వద్ద తీసుకున్న సెషన్లకు సంబంధించిన ఖర్చులను మాత్రమే తిరిగి చెల్లిస్తాయి. పాలసీలో ఉన్న మొత్తం బీమా రక్షణ చూసి మాత్రమే థెరపీ ఖర్చులు పూర్తిగా కవర్ అవుతాయని భావించకూడదు. ఉదాహరణకు పది లక్షల రూపాయల సమ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీలో కూడా ఓపీడీ చికిత్సకు పరిమిత కవరేజీ మాత్రమే ఉండవచ్చు. ఒక్కో సెషన్‌కు చెల్లించే గరిష్ఠ మొత్తం, సంవత్సరానికి అనుమతించే సెషన్ల సంఖ్య లేదా మొత్తం ఓపీడీ పరిమితి వంటి నిబంధనలు కచ్చితంగా ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us