పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ న్యూస్‌ మీ కోసమే!

Updated on: Oct 28, 2026 | 12:09 PM

దీపావళి వేళ వంట గ్యాస్‌ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మెకు డిస్ట్రిబ్యూటర్లు పిలుపునివ్వడంతో గ్యాస్‌ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఆఫ్‌ ఇండియా సమ్మెను వ్యతిరేకిస్తూ ఆందోళనలను విరమించుకోవాలని సూచించింది. డెలివరీ కమిషన్లు, ఈకేవైసీ ఛార్జీల అంశాలపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది.

దీపావళి పండుగ వేళ వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పండుగ సమయంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా కేంద్ర పెట్రోలియం శాఖ అప్రమత్తమైంది. డిస్ట్రిబ్యూటర్ల సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టింది. తమ వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ వేదికగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే, ఈ సమ్మెను ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. పండుగ సీజన్‌లో ప్రజలకు గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున, ఆందోళనలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీ ఏజెన్సీలను ఆదేశించింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, డిస్ట్రిబ్యూటర్లు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఏ కుటుంబానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం గ్యాస్ సరఫరాను కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎఫ్‌ఎల్‌డీఐ స్పష్టం చేసింది. డెలివరీ కమిషన్లు, ఈకేవైసీ ఛార్జీల చెల్లింపుల వంటి అంశాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..

రెండేళ్లకే చిన్నారి అద్భుతం.. తబలాపై 12 తాళాలు వాయించి రికార్డ్‌

ఇంజనీరింగ్‌ చేయని ఇంజనీర్‌.. ఎగిరే కారును సృష్టించిన యువకుడు

ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Loading...
Unable to load recommendations.
Follow Us