Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా

Updated on: Mar 21, 2026 | 1:16 PM

బీట్‌రూట్ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. అయితే, కిడ్నీలో రాళ్లు, లో-బిపి, జీర్ణ సమస్యలు, అలర్జీలు ఉన్నవారికి ఇది హానికరం. ఆక్సలేట్లు రాళ్లను పెంచుతాయి, నైట్రేట్లు రక్తపోటును మరింత తగ్గిస్తాయి. అలాంటివారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి. వైద్యుల సలహా తప్పనిసరి. బీట్‌రూట్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రక్తాన్ని పెంచే గుణం. ఫోలేట్, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలతో నిండిన ఈ ఎర్రటి దుంపను 'సూపర్ ఫుడ్' అని పిలుస్తారు.

బీట్‌రూట్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రక్తాన్ని పెంచే గుణం. ఫోలేట్, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలతో నిండిన ఈ ఎర్రటి దుంపను ‘సూపర్ ఫుడ్’ అని పిలుస్తారు. చర్మ సౌందర్యానికి, బాడీ డిటాక్స్‌కు చాలామంది బీట్‌రూట్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా.. బీట్‌రూట్ అందరికీ మేలు చేయదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ‘విషం’తో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. ఎవరికైతే కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదా గతంలో ఆ సమస్యతో బాధపడ్డారో, వారు బీట్‌రూట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలి. బీట్‌రూట్‌లో ‘ఆక్సలేట్’ అనే మూలకం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా నొప్పి తీవ్రతరం కావడమే కాకుండా, కొత్తగా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇది హై బిపి ఉన్నవారికి వరమే కానీ, ఇప్పటికే లో-బిపి తో బాధపడేవారికి ఇది శాపం కావచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి నీరసం, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు బీట్‌రూట్ రసానికి దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు నొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ‘బీటూరియా’ అనే పరిస్థితి వల్ల మూత్రం లేదా మలం ఎర్రటి రంగులోకి మారవచ్చు. ఇది ప్రాణాంతకం కాకపోయినా, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. అంతేకాదు, అలర్జీ ఉన్నవారు బీట్‌రూట్ జోలికి వెళ్లకపోవడమే మంచింది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, చికాకు కలగవచ్చు. కొంతమందిలో వికారం లేదా వాంతులు కూడా కనిపిస్తాయి. ఏదైనా అతిగా తీసుకుంటే అది హాని కలిగిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవాలనుకునే వారు మొదట తక్కువ పరిమాణంతో ప్రారంభించాలి. ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు తమ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా

బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం

దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి

సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న

వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Us