Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు

Updated on: May 06, 2026 | 5:43 PM

ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు వడ్లు, మొక్కజొన్నలు నీట మునిగాయి. అయితే, ఈ వర్షాలు తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వానలు పడుతున్నాయి. కర్నాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో ఈదురుగాలుల బీభత్సానికి భారీ వర్షం తోడవడంతో.. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, జగదేవ్‌పూర్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు నీటిపాలయ్యాయి. కళ్లముందే పంట పాడవుతుండటంతో రైతులు కన్నీరుమున్నీ రవుతున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల వరకూ కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో రాబోయే నాలుగు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇప్పటికే ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అంటు దక్షిణ కోస్తాలో వర్షాల ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇది తాత్కాలికమేనని వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ తెలిపారు. రాబోయే ఐదు రోజుల తర్వాత మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Divvala Madhuri: ‘ఇలా అయితే రాజకీయాలు కష్టం’ త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్

Thalapathy Vijay: చదువు అంతంత మాత్రమే.. కానీ పట్టుదల కొండంత

Chiranjeevi: అప్పట్లో విజయ్‌ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే

Rajinikanth: ‘పీక్ క్రేజ్‌ వేస్టెడ్ తాత’ అంటూ రజినీ పై ట్రోల్స్

Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

Follow Us