AP Municipal Election Results Live: ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ప్రత్యక్ష ప్రసారం

Updated on: Nov 03, 2026 | 9:03 AM

ఆంధ్రప్రదేశ్‌లో 92 పురపాలికలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల్లో 6,831 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మురసు తుఫాన్‌ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్‌ ఆలస్యం కానుంది. రీపోలింగ్‌ తర్వాత రాష్ట్రంలో 62.16 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది.

ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. కొన్ని చోట్ల మురసు తుఫాన్ ప్రభావంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కానుంది.. 92 పురపాలికల్లో పోలింగ్‌ జరగగా… ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో 556 కౌంటింగ్ హాల్స్.. 6 వేల 831 కౌంటింగ్ టేబుల్స్‌ ను సిద్ధం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 6 వేల 831 మంది సూపర్‌వైజర్లు ఉంటారు. కౌంటింగ్ కోసం 13వేల 662 మంది సిబ్బంది ఉంటారు. ఓట్ల లెక్కింపులో 27 వేల 324 మంది అసిస్టెంట్లు పాల్గొంటారు.

ఏకగ్రీవం అయిన స్థానాలు ఇవే..

13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం కాగా.. మున్సిపాలిటీల్లోని 3,020 వార్డులకు గానూ 637 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,382 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం స్థానాలకు 10వేల 262 మంది పోటీ చేశారు. వీరి భవితవ్యం కాసేపట్లో తేలనుంది.

ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. కౌంటింగ్ సెంటర్‌ లోపల, బయట సీసీ కెమెరాలు ఉంటాయి. పాస్‌లు ఉన్న ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ హాల్‌లోపలికి అనుమతి ఉంటుంది. రీ పోలింగ్ తర్వాత చూస్తే.. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్ నమోదైనట్టు SEC ప్రకటించింది. 96 లక్షల 89వేల 61 మంది ఓటర్లకు గాను 60లక్షల 22వేల 411 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం చూస్తే… పెద్ద నగరాల కంటే చిన్న మున్సిపాలిటీల్లోనే అధికంగా పోలింగ్ జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా?

Published on: Nov 03, 2026 07:55 AM
Loading...
Unable to load recommendations.
Follow Us