ఏపీని వెంటాడుతున్న తుఫాన్ల గండం!

Updated on: Nov 25, 2026 | 1:10 PM

ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ చివరి నాటికి ఒకటి, డిసెంబర్ రెండో వారంలో మరొకటి అల్పపీడనాలుగా ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి తీవ్రత, తుఫాన్‌గా బలపడతాయా లేదా అన్నది ప్రస్తుతం అంచనా వేయలేమని నిపుణులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌ను మరో రెండు తుఫాన్లు వెంటాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే వరుస విపత్తుల నుంచి కోలుకోకముందే, బంగాళాఖాతంలో నవంబర్ చివరి వారంలో ఒకటి, డిసెంబర్ రెండో వారంలో మరొకటి అల్పపీడనాలుగా ఏర్పడే సూచనలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. నవంబర్ 26 తర్వాత దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఇది అల్పపీడనంగా మారి, తుఫానుగా బలపడుతుందా లేదా అనేదానిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, దీని వల్ల శీతాకాలం ఆరంభంలో తుఫాన్ల సంఖ్య పెరుగుతోందని విశ్లేషకులు తెలిపారు. గతంలో ఆర్నాబ్, మొరసు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం ఏర్పడే సిస్టమ్స్‌పై ఐఎండీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. తీర ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

Loading...
Unable to load recommendations.
Follow Us