ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!
ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎసిడిటీ, సున్నితమైన జీర్ణవ్యవస్థ, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధికంగా తీసుకుంటే కడుపునొప్పి, విరేచనాలు రావచ్చు. కొందరిలో అలర్జీ లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ఉసిరిని ఆహారంలో చేర్చుకోవాలి.
ఉసిరిని ఆయుర్వేదంలో ‘సూపర్‌ఫుడ్’ అంటారు. ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడం, చర్మం కాంతివంతంగా మారడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మలబద్ధకం తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఉసిరి అందరికీ ఒకేలా ప్రయోజనం చేకూర్చదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉసిరిని మితంగా తింటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, దీనిని అధిక మోతాదులో తీసుకుంటే కడుపునొప్పి, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సున్నితమైన కడుపు ఉన్నవారు లేదా ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు దీనిని తీసుకుంటే కడుపులో మంట పెరుగుతుంది. ఉసిరిలో ఆక్సలేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఉసిరిని ఎక్కువగా తీసుకుంటే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కొంతమందికి ఉసిరి పడదు. దీనిని తిన్న తర్వాత చర్మంపై దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే దీనిని తీసుకోవడం ఆపేయాలి. ఆరోగ్యానికి మంచిదని ఎటువంటి నిపుణుల సలహా లేకుండా పరిమితికి మించి ఉసిరిని తీసుకోవడం ప్రమాదకరం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మాత్రమే దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్
పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ సెక్యూరిటీ!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. గుండెకు ముప్పు తప్పదు!
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. పండ్లు, పాలు కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి!
