రష్యన్ యుధ్ధ విమానాలను అడ్డుకున్న యుఎస్ ఫైటర్ జెట్స్

అమెరికాలోని అలాస్కా గగనతలంలో నాలుగు రష్యన్ విమానాలను అమెరికా యుధ్ధ విమానాలు అడ్డుకున్నాయి. దక్షిణ అలాస్కాకు 65 నాటికల్ మైళ్ళ దూరంలో 'అలేషియన్ ద్వీప 'సమీపానికి రష్యన్ 'టీయు-142' విమానాలు చేరాయి. ఇవి అలాస్కన్..

రష్యన్ యుధ్ధ విమానాలను అడ్డుకున్న యుఎస్ ఫైటర్ జెట్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2020 | 4:16 PM

అమెరికాలోని అలాస్కా గగనతలంలో నాలుగు రష్యన్ విమానాలను అమెరికా యుధ్ధ విమానాలు అడ్డుకున్నాయి. దక్షిణ అలాస్కాకు 65 నాటికల్ మైళ్ళ దూరంలో ‘అలేషియన్ ద్వీప ‘సమీపానికి రష్యన్ ‘టీయు-142’ విమానాలు చేరాయి. ఇవి అలాస్కన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ పరిధిలో 8 గంటల పాటు తిరిగాయట. అయితే ఇవి అంతర్జాతీయ వైమానిక గగనతలంలోనే ఉన్నాయని, అమెరికా లేదా కెనడా ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ కాలేదని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ట్వీట్ చేసింది. అలాస్కా సమీపంలో రష్యన్ విమానాలను అమెరికా అడ్డుకోవడం ఇది నాలుగో సారి. రెండు అమెరికన్ ‘బీ-1 బాంబర్లు’ రష్యా సమీపంలోని బాల్టిక్, బ్లాక్ సీ పై ఎగురుతుండగా రష్యన్ విమానాలు అడ్డుకున్న ఇమేజీలను రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ గత మే 29 న ప్రచురించింది.

ఇటీవలి కాలంలో అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఆశించినంత సజావుగా లేవు. తాజాగా ఈ విమానాల వ్యవహారంపై ఇటు అమెరికా గానీ, రష్యా గానీ స్పందించలేదు.

Latest Articles