ఇంకెక్కడి సామాజిక దూరం ? యూపీలో మరీ దారుణం !

ఇతర శ్రామిక వర్గాలను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. నోయిడా, ఘజియాబాద్, బులంద్ షహర్, అలీగఢ్ తదితర  ప్రాంతాల్లో నిలిచిపోయినవారికి తోడ్పడేందుకు రవాణా శాఖ అధికారులు

ఇంకెక్కడి సామాజిక దూరం ? యూపీలో మరీ దారుణం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 28, 2020 | 5:20 PM

కరోనా నివారణకు ప్రజలంతా విధిగా సామాజిక దూరం పాటించాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపు యూపీలో అభాసు పాలవుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో ఎక్కడికక్కడ చిక్కుబడిపోయిన కార్మికులు, వలస కూలీలు, ఇతర శ్రామిక వర్గాలను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. నోయిడా, ఘజియాబాద్, బులంద్ షహర్, అలీగఢ్ తదితర  ప్రాంతాల్లో నిలిచిపోయినవారికి తోడ్పడేందుకు రవాణా శాఖ అధికారులు శుక్రవారం రాత్రే ఆయా బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో సంప్రదింపులు జరిపారు. ఈ బస్సుల ఏర్పాటు కోసం యోగి ఆదిత్యనాథ్ నిన్న రాత్రంతా అధికారులకు ఆదేశాలిస్తూ బిజీబిజీగా గడిపారు. కార్మికులు, కూలీలకు ఆహారం, నీరు ఇవ్వాలని సూచించారు. శనివారం ఉదయం సీనియర్ పోలీసు అధికారులు లక్నోలోని చార్ బాగ్ బస్ స్టేషన్ చేరుకొని ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో  ఉన్న ఈ శ్రామికులంతా తమ బస్సులెక్కారు.  సామాజిక దూరమన్న ప్రసక్తే లేదు. అనంతరం ఈ బస్సులు కాన్పూర్, బలియా, వారణాసి, గోరఖ్ పూర్ వంటి వివిధ ప్రాంతాలకు బయలుదేరాయి. ఇక సామాజిక దూరమంటారా ?  అది మిధ్యే అన్నమాట !

Latest Articles