కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. కిషన్‌రెడ్డిని చంపేస్తామంటూ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా అజ్ఞాతవ్యక్తులు బెదిరించారు. దీంతో కిషన్‌రెడ్డి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కిషన్‌రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. అయితే గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేఎల్పీ నేతగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కూడా బెదిరింపు ఫోన్ కాల్స్, ఇంటి దగ్గర రెక్కీలను […]

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 12:00 PM

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. కిషన్‌రెడ్డిని చంపేస్తామంటూ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా అజ్ఞాతవ్యక్తులు బెదిరించారు. దీంతో కిషన్‌రెడ్డి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కిషన్‌రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. అయితే గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేఎల్పీ నేతగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కూడా బెదిరింపు ఫోన్ కాల్స్, ఇంటి దగ్గర రెక్కీలను ఎదుర్కొన్నారు. తాజాగా ఇప్పుడు కేంద్ర మంత్రి అయినా కూడా కిషన్‌రెడ్డికి బెదిరింపులు ఆగడంలేదు.