హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందం రద్దు…బ్రిటన్

చైనాకు, తనకు మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. హాంకాంగ్ పై ఆధిపత్యానికి చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెచ్చింది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీతో..

హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందం రద్దు...బ్రిటన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2020 | 1:51 PM

చైనాకు, తనకు మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. హాంకాంగ్ పై ఆధిపత్యానికి చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెచ్చింది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీతో తలనొప్పులు తెచ్చుకుంటున్న బ్రిటన్ కి.. మధ్యలో ఈ హాంకాంగ్ ‘తకరారు’ కూడా తోడవడంతో.. ఇక ఆ నగరంతో ‘నేరస్థుల అప్పగింత’ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పార్లమెంటులో ప్రకటించారు. అలాగే ఆయుధ నిషేధానికి సంబంధించి చైనాతో గల సుదీర్ఘకాల ఒప్పందాన్ని పొడిగిస్తున్నామని, తాజాగా ఈ నిషేధ నిబంధన హాంకాంగ్ కి కూడా వర్తిస్తుందని ఆయన చెప్పారు. అంటే స్వయం ప్రతిపత్తిగల ఆ ప్రాంతానికి కూడా తమ దేశం నుంచి ఎలాంటి ఆయుధాలూ ఎగుమతి కాబోవన్నారు. ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ఈ నెలారంభంలోనే హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.

2027 కల్లా చైనాలోని హువే టెక్నాలజీ సంస్థ నుంచి విడిభాగాలను తమ దేశ 5 జీ నెట్ వర్క్ తెప్పించుకోవడానికి స్వస్తి చెప్పాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. అటు-అమెరికా చెప్పినట్టు బ్రిటన్ నడచుకుంటోందని చైనా ఆరోపిస్తోంది. సుమారు మూడు లక్షలమంది హాంకాంగ్ వాసులకు తమ దేశ తాత్కాలిక పౌరసత్వం ఇస్తామని బ్రిటన్ ఆ మధ్య చేసిన ప్రకటన పట్ల చైనా మండిపడుతోంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!