మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు..మృతి

ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్‌ 13న మహబూబాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్తాపంతో మృత్యువాతపడ్డాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నవంబర్‌ 5వ తారీఖు డెడ్‌లైన్‌ అంటూ టీవీలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను చూస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్‌ రావు మతిస్థిమితం కొల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వర్‌రావు తనకు తానే నవ్వుతూ, ఏడుస్తూ […]

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు..మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 14, 2019 | 7:23 PM

ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్‌ 13న మహబూబాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్తాపంతో మృత్యువాతపడ్డాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నవంబర్‌ 5వ తారీఖు డెడ్‌లైన్‌ అంటూ టీవీలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను చూస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్‌ రావు మతిస్థిమితం కొల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వర్‌రావు తనకు తానే నవ్వుతూ, ఏడుస్తూ ఉండిపోయాడు. నారాయణఖేడ్‌ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా నాగేశ్వర్‌రావు విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో..పిచ్చివాడైపోయిన నాగేశ్వర్ రావుకు అప్పట్నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అతడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. నాగేశ్వర్‌ రావు మృతితో ఆయన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడి స్వస్థలం ఘానాపూర్‌ గ్రామం కాగా, పిల్లల చదువుల కోసం గతంలో సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటున్న నాగేశ్వర్‌రావు ఫ్యామిలీ..సమ్మె కారణంగా జీతాలు లేక, ఇంటి అద్దె కట్టలేని స్థితిలో జోగిపేటలోని అత్తవారింట్లోనే ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగ ఆందోళనతో అనారోగ్యానికి గురైన తన తార్నాకలోని ఆర్టీసీ భీమా ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడి వైద్యులు పట్టించుకోలేదని నాగేశ్వర్‌రావు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కోలుకుంటాడని, తిరిగి ఉద్యోగంలో చేరి తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డ తమకు నిరాశే మిగిలిందని ఆ ఇల్లాలు రోధించింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో