హైదరాబాద్ నుంచి మొదలై కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ‘ఇన్ఫినిటీ రైడ్ – 2020 : ప్రారంభించిన తెలంగాణ గవర్నర్

'ఇన్ఫినిటీ రైడ్ -2020'ను తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ రైడ్ లో భాగంగా పారా సైక్లిస్టులు హైదరాబాద్ నుంచి బయలుదేరి..

హైదరాబాద్ నుంచి మొదలై కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 'ఇన్ఫినిటీ రైడ్ - 2020 : ప్రారంభించిన తెలంగాణ గవర్నర్
Follow us

|

Updated on: Dec 20, 2020 | 2:47 PM

‘ఇన్ఫినిటీ రైడ్ -2020’ను తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ రైడ్ లో భాగంగా పారా సైక్లిస్టులు హైదరాబాద్ నుంచి బయలుదేరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి మొదలుకానున్న ఆఖరి దశ ఇన్ఫినిటీ రైడ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా 1279కిలో మీటర్లు ప్రయాణించి గమ్యస్థానమైన కన్యాకుమారికి ఈనెల 31న చేరుకోనుంది. మొత్తం 36 నగరాల గుండా 45 రోజుల పాటు జరిగే రైడ్ ద్వారా నిధులను కూడా సేకరించనున్నారు. పారా అథ్లెట్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎమ్ఎఫ్) చేస్తున్న కృషిని ఈ సందర్భంగా తమిళ సై ప్రశంసించారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తాను పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదేనని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అద్భుత ప్రతిభ దాగున్న దివ్యాంగులకు మద్దతుగా నిలువాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె వెల్లడించారు. టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా, మంచు లక్ష్మీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్తాధ్వర్యంలో “ఇన్ఫినిటీ రైడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.