Viral Video: భారీ అనకొండల మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి.. వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.!

Viral Photo: సరీసృపాల్లో అనకొండ ప్రమాదకరమైనది కూడా. సాధారణంగా పాము కనిపిస్తేనే మనం దడుసుకుంటాం. అలాంటిది అనకొండ మన దగ్గరలో ఉంటే..

Viral Video: భారీ అనకొండల మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి.. వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.!
Python

Updated on: Sep 25, 2021 | 1:37 PM

సరీసృపాల్లో అనకొండ ప్రమాదకరమైనది కూడా. సాధారణంగా పాము కనిపిస్తేనే మనం దడుసుకుంటాం. అలాంటిది అనకొండ మన దగ్గరలో ఉంటే.. ఇంకేమైనా ఉందా.? ఆ ఊహకే గుండె ఆగిపోతుంది. ఖచ్చితంగా పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే. కానీ ఇక్కడొక వ్యక్తి ఏకంగా అనకొండలతో ఆటలు ఆడుతున్నాడు. వాటితో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ కథేంటో చూసేద్దాం పదండి.!

వైరల్ వీడియోలో ఓ వ్యక్తి అనకొండల మధ్య కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. సరదా మాట్లాడుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఇక అప్పుడే అకస్మాత్తుగా పైన ఉన్న అనకొండలు ఒక్కసారిగా అతడిపై పడతాయి. ఇక ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మిస్టర్ బ్రూవర్.. అతడికి కాలిఫోర్నియాలోని సరీసృపాల సంరక్షణశాల ఒకటి ఉంది. అనకొండలను పట్టడంలో అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా అతడి సామాజిక మాధ్యమాల్లో సైతం అనేక భయంకరమైన పాములను అలవోకగా పట్టే వీడియోలు, ఫోటోలు ఉంటాయి. వాటిల్లో అనేక ఫోటోలు ఒళ్లుగగ్గుర్పోడిచే విధంగా ఉంటాయి. మీరు అనుకున్నట్లుగానే మిస్టర్ బ్రూవర్ ఉద్యోగం చాలా ప్రమాదకరమైనది, అతడి ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారానే అర్ధమవుతుంది.

మిస్టర్ బ్రూవర్‌కు సంబంధించిన లేటెస్ట్ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎంత సరీసృపాలను పట్టుకోవడంలో అనుభవం ఉన్నా.. ఒక్క నిమిషం చాలు ఆ భారీ ఆకారం అమాంతం మింగేయడానికి.. అన్ని వేళలా జాగ్రత్త అవసరమని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి చదవండి:

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో సహాజ నటి.!

బోర్డుతో గొడవపడ్డాడు.. సెలెక్టర్లను జోకర్‌లన్నాడు.. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు.. అతడెవరో తెలుసా.?

గొయ్యిలో దాక్కున్న అడవి పందిని వేటాడిన చిరుత.. వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!