యువతిని అసభ్యంగా తాకిన పూజారి.. చితకబాదిన స్థానికులు..వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు పూజారిని చితకబాదిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా, పట్టుకుని కింద పడేసి కొట్టారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. కాగా తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యువతిని అసభ్యంగా తాకిన పూజారి.. చితకబాదిన స్థానికులు..వీడియో వైరల్
Dd Hills Temple Priest

Updated on: Aug 24, 2025 | 8:53 PM

కర్నాటకలో ఓ ఆలయ పూజారి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. గుడికి వచ్చిన ఆ యువతిని అనుచితంగా తాకడంతో పాటు, దుస్తులు తొలగించాలని కోరినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు పూజారిని చితకబాదిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా, పట్టుకుని కింద పడేసి కొట్టారు.

తుమకూరులోని దేవరాయనదుర్గ ఆలయ పూజారి ఒకరు కుంకుమ పూసుకుంటూ ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో యువకులు ఆయనపై దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

పూజారి నాగభూషణాచార్యను మహిళలు, ఇద్దరు యువకులు కర్రలతో కొట్టారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..