ఆన్‌లైన్‌లో మొబైల్ ఆర్డర్ పెట్టాడు.. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ చూసి ఖంగుతిన్నాడు.!

|

Mar 22, 2024 | 1:59 PM

ఈ రోజుల్లో ప్రజలందరూ ప్రతీది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. ఫుడ్ నుంచి ఫర్నిచర్ వరకు.. కంపాస్ నుంచి కంప్యూటర్ వరకు అన్నీ కూడా ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ పలుసార్లు మోసాలు జరుగుతున్నాయి.

ఆన్‌లైన్‌లో మొబైల్ ఆర్డర్ పెట్టాడు.. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ చూసి ఖంగుతిన్నాడు.!
Representative Image
Follow us on

ఈ రోజుల్లో ప్రజలందరూ ప్రతీది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. ఫుడ్ నుంచి ఫర్నిచర్ వరకు.. కంపాస్ నుంచి కంప్యూటర్ వరకు అన్నీ కూడా ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ పలుసార్లు మోసాలు జరుగుతున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. ఇంటికొచ్చిన పార్శిల్‌లో మరో వస్తువు దర్శనమిస్తోంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. ఓ యువకుడు ఆన్‌లైన్‌లో మొబైల్ ఆర్డర్ పెట్టాడు. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు కంగుతిన్నాడు.

ఆమాలిక్ తుయ్యబ్ అనే యువకుడు ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్(2A)ను ఆర్డర్ చేశాడు. ఇక రెండు రోజుల అనంతరం ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూసి.. దెబ్బకు కంగుతిన్నాడు. అందులో నథింగ్ ఫోన్‌కు బదులుగా ఏదో ఫేక్ బ్రాండెడ్(iKall) ఫోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక దాన్ని రీప్లేస్ చేద్దామని ఫ్లిప్‌కార్ట్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదిస్తున్నా.. ఎలాంటి రిప్లయ్ రావట్లేదని పేర్కొంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..