Optical illusion: మీ ఐ పవర్‌కి ఓ టెస్ట్‌.. ఈ ఫొటోలో ఉన్న 280 నెంబర్‌ని కనిపెట్టగలరా.?

|

Mar 22, 2024 | 5:58 PM

ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలకు ఫుల్ క్రేజ్‌ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. మన కంటి శక్తిని పరీక్షించే ఆప్టికల్‌ ఇల్యూజన్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Optical illusion: మీ ఐ పవర్‌కి ఓ టెస్ట్‌.. ఈ ఫొటోలో ఉన్న 280 నెంబర్‌ని కనిపెట్టగలరా.?
Follow us on

ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలకు ఫుల్ క్రేజ్‌ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. మన కంటి శక్తిని పరీక్షించే ఆప్టికల్‌ ఇల్యూజన్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైన ఫొటో చూడగానే మీకు ఏ నెంబర్‌ కనపిస్తోంది.? ఏముంది 208 అని చెబుతారు కదూ, అయితే అందులో ఒక 280 నెంబర్‌ కూడా ఉంది. ఆ నెంబర్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో ముఖ్య ఉద్దేశం. అన్ని ఒకేలా కనిపిస్తున్నా ఇందులోనే డిఫ్రెంట్‌గా ఉన్న 280 కూడా ఉంది.

అయితే సరిగ్గా గమనిస్తే ఆ నెంబర్‌ని కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. కేవలం 10 సెకండ్లలోనే నెంబర్‌ కనిపెడితే మీ ఐ పవర్ సూపర్‌ ఉన్నట్లు లెక్క. ఇంతకీ మీరు ఈ పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? ఏంటి.? ఎంత వెతికినా నెంబర్‌ కనిపించడం లేదా. అయితే ఓసారి పై నుంచి నాలో వరుసను సరిగ్గా గమనించడం అందులోనే సమాధానం ఉంది. ఇప్పటికీ సమాధాన దొర్కపోతే ఓసారి సమాధానం కోసం కింది ఫొటోను చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..