Viral Video: ఇదెక్కడి పిచ్చిరా బాబు.. లైకుల కోసం ఇలా చేస్తారా.. పట్టు తప్పితే యమలోకానికే!

|

Mar 14, 2022 | 12:44 PM

ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేందుకు.. నెట్టింట లైకులు, వ్యూస్ పెంచుకునేందుకు జనాలు పిచ్చి పిచ్చి వీడియోలు, భయంకరమైన స్టంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఇదెక్కడి పిచ్చిరా బాబు.. లైకుల కోసం ఇలా చేస్తారా.. పట్టు తప్పితే యమలోకానికే!
Viral Video
Follow us on

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేందుకు.. నెట్టింట లైకులు, వ్యూస్ పెంచుకునేందుకు జనాలు పిచ్చి పిచ్చి వీడియోలు, భయంకరమైన స్టంట్స్ చేస్తున్నారు. సాధారణంగా మూవీస్‌లో హీరోలు స్టంట్స్ చేస్తుంటే.. వాటిని పర్యవేక్షించేందుకు స్పెషల్‌గా ట్రైనర్ లేదా స్టంట్స్‌మెన్లు ఉంటారు. ఎక్కడా కూడా సొంతంగా హీరో రిస్కీ స్టంట్స్ ట్రై చేయడు. కానీ యూత్‌కు ఇప్పుడు స్టంట్స్‌పై బాగా క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకునేందుకు రిస్కీ స్టంట్స్‌ను చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు కూడా షాక్ కావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కొండ అంచున నిల్చుని బ్యాక్ ఫ్లిప్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఏటవాలుగా ఉన్న ఆ చోట.. స్టంట్ చేసేటప్పుడు చిన్న తప్పిదం జరిగినా.. ఆ వ్యక్తి ప్రాణాలు పోయినట్లే. అయితే అతడు పర్ఫెక్ట్‌గా స్టంట్ చేసిన విధానం చూస్తే కచ్చితంగా చాలా రోజుల నుంచి ప్రాక్టీసు చేసి ఉంటాడని అనుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘haveenreels’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీన్ని 5.42 లక్షల మంది వీక్షించారు. అలాగే ఈ వీడియోను 17 వేల మందికి పైగా లైక్ కొట్టారు. అదే సమయంలో, ఆ యువకుడి స్టంట్ ప్రమాదకరమైనదని నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ రూపంలో విమర్శలు గుప్పించారు. ‘ఈ స్టంట్ చేసేటప్పుడు.. పట్టు తప్పితే పరిస్థితి ఏంటని’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘లైక్‌ల కోసం ప్రాణాన్ని పణంగా పెడతావా’ అని మరొకరు చీవాట్లు పెట్టారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి..